ఎయిడ్స్ రోగులపైనా ట్రంప్ ప్రతీకారం.. మరో 40 లక్షల మందికి డెత్..!
అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఎయిడ్స్ రోగులపై ప్రభావం పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి HIV నిధుల పంపిణీ సాయాన్ని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో హెచ్‌ఐవీ నిధులు పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించే ప్రమాదం ఉందని ఐరాస ఎయిడ్స్ విభాగం హెచ్చరించింది. అంతేకాక మరో 60 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఏటా అందించే విదేశీ సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దాదాపు 40 లక్షల మంది ఎయిడ్స్ రోగులపై ప్రభావం చూపనుంది. ఈ విషయాన్ని ఐరాస ఎయిడ్స్ విభాగం తెలిపింది. ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిడ్స్ వ్యాధి నివారణకు ఏటా అమెరికా ఇచ్చే రూ. 3.83 లక్షల కోట్ల సాయాన్ని నిలిపివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక USAIDS సంస్థలోని స్టాఫ్ ను 10,000 నుంచి 300లకు తగ్గించింది ట్రంప్ ప్రభుత్వం.

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్న తూర్పు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నిధుల కొరత కారణంగా ఆ దేశాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు తగ్గిపోయాయి. చికిత్స కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది.
ప్రపంచ దేశాల్లోని ఎయిడ్స్ రోగులకు తమ వంతు సాయం కింద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ఫ్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్(PEPFAR) అనే విధానాన్ని అప్పటి అధ్యక్షుడు జార్జి.వీ. బుష్ స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ కొనసాగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగంగా అమెరికా ఏటా అధిక మొత్తంలో నిధులను పంపిణీ చేసేది. 2024లోనే 83 మిలియన్ల మంది ప్రజలకు సేవలు అందించింది. 55 పేద దేశాలకూ సాయం చేసింది. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ నిధులను నిలిపివేశారు.
The U.S. decision to withdraw funding from global AIDS programs has shocked supply chains, clinics, health care staffing, testing, and medication, and if not addressed, could lead to 4 million+ AIDS-related deaths and 6 million more HIV infections by 2029. https://t.co/Ok20gwp7Qp
— Global Health NOW (@ghn_news) July 10, 2025
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా సౌతాఫ్రికా(14శాతం)లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మొజాంబిక్, నైజీరియా ఉన్నాయి. ఎయిడ్స్ రోగుల సంఖ్యలో భారత్ నాలుగో ప్లేస్ లో ఉంది. భారత్ తర్వాత రష్యా, టాంజానియా, ఉగాండా ఉన్నట్లు సమాచారం.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications