Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Warning: భయంకరమైన రోజులు రాబోతున్నాయి!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యానికి ఉరితాడుగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి (UN) జారీ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇజ్రాయెల్-అమెరికా దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం గుండా నౌకల రాకపోకలు ఏకంగా 97 శాతం పడిపోవడం ఒక భయంకరమైన వాస్తవాన్ని కళ్లకు కడుతోంది.

హోర్ముజ్ జలసంధి అనేది కేవలం ఒక నీటి మార్గం కాదు, అది ప్రపంచానికి శక్తినిచ్చే 'ధమని'. ప్రపంచ చమురు వాణిజ్యంలో నాలుగో వంతు, గణనీయమైన మొత్తంలో ఎల్‌ఎన్‌జీ (LNG), ఎరువులు ఈ సన్నని జలసంధి ద్వారానే రవాణా అవుతాయి. యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్(UNCTAD) నివేదిక ప్రకారం, ఈ మార్గంలో అంతరాయం కలగడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, రవాణా, ఆహార ధరలు.. ఆకాశాన్ని తాకడమే. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరుగుతాయి.. వెరసి ఇవన్నీ కలిసి సామాన్యుడి కంచంలోని ఆహార ధరలను పెంచి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తాయి.

United Nations Warning Global Trade at Risk as Strait of Hormuz Shipping Drops Amid Middle East Conflict

84 శాతం ఆసియా దేశాలకే..

అంకెలు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండానే వెళ్లాలి. అందులో 84 శాతం ఆసియా దేశాల అవసరాలకే ఉద్దేశించబడింది. అంటే, ఈ జలసంధి మూతపడితే ఆసియా ఖండంలోని ఇంధన భద్రత కుప్పకూలే ప్రమాదం ఉంది. ఒక వారం ముందు వరకు ఈ మార్గం గుండా వెళ్లిన భారీ నౌకలు, దాడులు ప్రారంభమైన నాటి నుంచి కనిపించకుండా పోయాయి. బీమా ప్రీమియంలు పెరగడం, ఓడల రాకపోకలకు ముప్పు ఉండటంతో సరఫరా గొలుసు పూర్తిగా ఛిన్నాభిన్నమైంది.

United Nations Warning Global Trade at Risk as Strait of Hormuz Shipping Drops Amid Middle East Conflict

'ప్రైస్ షాక్' కోలుకోలేని దెబ్బ

అప్పుల భారంతో కునారిల్లుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ 'ప్రైస్ షాక్' కోలుకోలేని దెబ్బ కానుంది. ఇప్పటికే ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలపై, గృహ బడ్జెట్‌లపై ఈ ధరల పెరుగుదల అదనపు ఒత్తిడిని పెంచుతుందని UNCTAD హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, నావిగేషన్ స్వేచ్ఛను పునరుద్ధరించకపోతే, ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్రిక్తతలు తగ్గించి, సురక్షిత వాణిజ్య మార్గాలను కాపాడటమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+