రాక్‌ఫోర్డ్‌లో కాల్పులు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న డాన్ కార్టర్ లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దుండగుడు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం మాత్రం ఇం తెలియరాలేదు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

కాల్పుల ఘటనపై రాక్‌ఫోర్డ్ మేయర్ టామ్ మెక్‌నమరా తీవ్ర ఆగ్రహం, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమని అన్నారు. ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్ట్ సిజీ పోలీసులు సూచించారు. ఆత్మరక్షణ కోసం అమెరికా దేశంలో అందరికీ తుపాకుల లైసెన్లు ఇస్తారు. అయితే, కొందరు దుండగులు ఇలా ప్రజలపై కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు తరచూ కొనసాగుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications