చైనా ఉరి వేస్తుందేమో..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఫెంటానిల్ ఉత్పత్తి, రవాణా చేసేవారికి చైనాలో మరణశిక్ష విధించేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నామని తెలిపారు. ఈ మేరకు చైనాతో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యం ఫెంటానిల్ కారణంగా అమెరికాకు జరిగిన నష్టానికి పరిహారంగా చైనాపై సుంకాలు విధించినట్లు వ్యాఖ్యానించారు.
తాజాగా వైట్ హౌస్ లో ఆయన మాట్లాడారు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయినప్పటికీ- ఫెంటానిల్ కారణంగా చైనాపై 20 శాతం టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని అన్నారు. 20 శాతం టారిఫ్ విధించడాన్ని చైనాకు ఓ శిక్షగా మారుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

చైనా ఎక్కువ శాతం ఫెంటానిల్‌ను ఉత్పత్తి చేస్తోందని, అదే ఈ టారిఫ్ కు కారణమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫెంటానిల్ ను పూర్తిగా చైనానే ఉత్పత్తి చేస్తోందనే సమాచారం కూడా తన వద్ద ఉందని పేర్కొన్నారు. అమెరికాతో పాటు మెక్సికోకూ చైనా పెద్ద ఎత్తున ఫెంటానిల్ ను సరఫరా చేస్తోందని తేల్చి చెప్పారు. ఫెంటానిల్‌ను అరికట్టడానికి చైనాతో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు.
చైనాపై 20 శాతం టారిఫ్ ను విధించడం వల్ల ఆ దేశం నుంచి బిలియన్ డాలర్ల మేర నష్ట పరిహారం చెల్లించినట్టవుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీన్ని నివారించుకోవడానికి చైనా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, ఫెంటానిల్‌ను ఉత్పత్తి చేసి అమెరికాకు రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఏ ఇతర దేశాల ద్వారా ఈ ఫెంటానిల్ ను అమెరికాకు పంపించినా, నేరుగా సరఫరా చేసిన చైనాకు శిక్ష తప్పదని ట్రంప్ హెచ్చరించారు. నిజానికి- ఈ ఒప్పందం మరింత ముందుగానే జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. చైనాలో ఫెంటానిల్ తయారు చేసి అమెరికాకు రవాణా చేసే వారికి ఇకపై ఆ దేశం మరణశిక్ష విధించే అవకాశం ఉందని, ఇది ఎంత త్వరగా అమలులోకి వస్తే అంత మంచిదని అన్నారు.
ఇప్పటి నుంచి ఫెంటానిల్‌కు సంబంధించిన అన్ని పదార్థాలను శాశ్వతంగా నిషేధిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషపూరిత పదార్థాలను సరఫరా చేసేవారు.. జీవితాంతం కఠిన కారాగార శిక్ష అనుభవించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన డ్రగ్ సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ అనుసరించిన ఓపెన్-బోర్డర్ విధానాలే దీనికి కారణమని ఆయన విమర్శించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విమర్శలు గుప్పించారు.
President Donald J. Trump recognizes Angel Families who have lost loved ones to drugs. ❤️
— The White House (@WhiteHouse) July 16, 2025
The HALT Fentanyl Act will end the fentanyl crisis and save countless lives. pic.twitter.com/sCtypoLBOJ
మాదకద్రవ్యాల డీలర్లు, మత్తు పదార్థాల అక్రమ రవాణాదారులు, నేర ముఠాలపై పోరాటం చేయడానికి, ఫెంటానిల్ కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక చారిత్రాత్మక అడుగు వేస్తున్నామని ట్రంప్ అన్నారు. ఆరు నెలల క్రితం తాము అధికారంలోకి వచ్చే సమయానికి అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన డ్రగ్ సంక్షోభం ఉందని, జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దులపై నిఘా ఉంచలేదని ధ్వజమెత్తారు. విదేశీ డ్రగ్ ముఠాలు విస్తరించడానికి అనుమతించారని విమర్శించారు.
President Trump just signed a bipartisan bill cracking down on fentanyl alongside Americans who shared heartbreaking stories about losing their children, and @FoxNews @CNN @MSNBC did not air the event.
— Karoline Leavitt (@PressSec) July 16, 2025
What could be more important than this?👇 pic.twitter.com/6w1IVkVelD
సరిహద్దుల గుండా అక్రమంగా మందులు, నేరస్తులు ప్రవేశించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ట్రంప్ అన్నారు. ఓపెన్ బోర్డర్ విధానం వల్ల ఫెంటానిల్ దేశంలోకి ప్రవేశించిందని, ఉండకూడని వ్యక్తులు కూడా వస్తున్నారని ఆయన అన్నారు. దీనివల్ల అమెరికా సమాజం నాశనం అవుతోందని, దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద సమస్యగా మారుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications