యూఎస్ క్యాపిటల్ వద్ద కాల్పుల కలకలం: పోలీస్, డ్రైవర్ మృతి

అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. యూఎస్ క్యాపిటల్ వద్ద ఆగంతకులు పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టారు. తర్వాత కాల్పులు జరపడంతో ఓ పోలీస్ చనిపోయారు. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ క్యాపిటల్ పోలీస్ చీఫ్ యోగానంద పీట్‌మ్యాన్ తెలిపారు. ఆ తర్వాత నగరంలో ఆంక్షలు విధించారు. బయటివారిని అనుమతించడం లేదు.

 US Capitol On Lockdown After Vehicle Rams 2 Officials, 1 Dead

భద్రతా బలగాలు, ఆగంతకుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కారు డ్రైవర్ కత్తి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అతనిని భద్రతా బలగాలు ఫైర్ చేసి చంపేశారు. ఒక అనుమానితుడు కస్టడీలో ఉన్నారని.. అధికారులు గాయపడ్డారని తెలిపారు. ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించామని ట్వీట్ చేశారు.

సీసీటీవీ ఫుటేజీలో మాత్రం బ్లూ కలర్ సెడాన్ కారు కనిపించింది. అదీ భద్రతా సిబ్బంది కారును ఢీ కొట్టింది. ఆ వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ ద్వారా గాయపడ్డవారిని ఆస్పత్రికి తలరించారు. ఆ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. ట్రంప్‌కు అనుకూలంగా మద్దతుదారులు ఆందోళన చేపట్టిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ సమయంలో ఐదుగురు జనం, పోలీసు అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అవక తవకలు జరిగాయని అప్పుడు ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+