Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు: మూడు వేల అమెరికా బలగాలు సిద్దం: ఇరాన్ హెచ్చరికలతో..!

Recommended Video

    అమెరికా vs ఇరాక్ ఇరాన్ | మూడో ప్రపంచ యుద్ధం కోసమా ?

    ఇరాన్‌ సైన్యానికి చెందిన అగ్రస్థాయి కమాండర్‌.. ఆ దేశంలోని రెండో శక్తివంతమైన నేత జనరల్‌ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చటంలో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో పరిస్థితులు మారిపోయాయి. ముందు గానే అమెరికాకు చెందిన దాదాపు మూడు వేల మంది సైనిక బలగాలు మధ్య తూర్పు ప్రాంతంలో మొహరించాయి. క్రవారం ఉదయం ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ హతమైనట్టు అమెరికా ప్రకటించింది.

    తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడి జరిపినట్టు తెలిపింది. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న సులేమానీని ఎప్పు డో చంపాల్సిందని ట్రంప్‌ పేర్కొనగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది.

    అందుకే హతమార్చాం..

    అందుకే హతమార్చాం..

    సులేమానీ జీవించి ఉంటే వందల మంది అమెరికన్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదనీ, అమెరికా ఆర్థిక, రాజకీయ, దౌత్య ప్రయోజనాలూ ప్రమాదంలో పడేవనీ, అందుకే అంతమొందించామనీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో తెలిపారు. అనేక మంది అమెరికా దౌత్యవేత్తలను చంపడానికి ఆయన కుట్రపన్నాడని పేర్కొన్నారు. పెంటగాన్‌ కూడా ఓ ప్రకటనలో సులేమానీ హత్య వార్తను ధ్రువపరిచింది. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఆయనను కడతేర్చామని వెల్లడించింది. అనేక మంది అమెరికా దౌత్యవేత్తలను చంపడానికి ఆయన కుట్రపన్నాడని పేర్కొన్నారు. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఆయనను కడతేర్చామని వెల్లడించింది. సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు.

    అమెరికా బలగాలు మొహరింపుతో..

    అమెరికా బలగాలు మొహరింపుతో..

    ఇక, కువైట్ ఏయిర్ బేస్ లో అమెరికాకు చెందిన సైనిక బలగాలు భారీగా మోహరించటంతో పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. దాదాపు 750 బలగాలు అక్కడ మోహరించినట్లుగా తెలుస్తోంది. ఇరాక్ లోని అమెరికా రాయబారి కార్యాలయం వద్ద నిరసనల తరువాత ఈ బలగాలను మొహరించారు. మరిన్ని బలగాలను అక్కడకు తరలించేందుకు అమెరికా సిద్దం అవుతోంది. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వేల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని ట్రంప్‌ వ్యాఖ్యానించగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. మరోవైపు సులేమానీ హత్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.

    ఇరాక్‌ నుంచి వెనక్కి రండి

    ఇరాక్‌ నుంచి వెనక్కి రండి

    ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్‌ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్‌ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. ఇస్మాయిల్‌ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్‌ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్‌ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్‌ రౌహని హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+