కదనరంగంలో కాలు పెట్టిన అమెరికా మెరైన్ మెరికలు- ఇరాన్ యుద్ధం తీవ్రం
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాల మధ్య అమెరికా అనూహ్య చర్యకు దిగింది. మధ్యప్రాచ్యంలో వేలాదిమంది సైన్యాన్ని రంగంలోకి దింపింది. 3,500 మందికి పైగా సైనికులను మోహరింపజేసింది. యూఎస్ఎస్ ట్రిపోలీ నౌకలోని 2,500 మంది మెరైన్‌లు ఇప్పటికే ఆపరేషన్ జోన్‌లో ఉన్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. వీరికి అదనంగా కొత్తగా పదాతి దళాన్ని మోహరింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైమానిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన అమెరికా, ఇప్పుడు తాజాగా గ్రౌండ్ ఆపరేషన్స్ కు దిగింది.
ఈ విషయాన్ని పెంటగాన్ నిర్ధారించించింది. ఇరాన్‌లో భూతల సైనిక కార్యకలాపాలకు సిద్ధపడినట్లు వెల్లడించింది. భూతల బలగాల మోహరింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదంపై స్పష్టత లేదని 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. యూఎస్ అధికారులను తన కథనంలో ఉటంకించింది. అత్యాధునిక యుద్ధనౌక యూఎస్ఎస్ ట్రిపోలీ ద్వారా అమెరికా పదాతిదళాలు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి. ట్రిపోలీ- మల్టీ మోడల్ వార్ షిప్. ఏకకాలంలో ఎఫ్-35 స్టెల్త్ జెట్‌లు, ఆస్ప్రేలను ఆపరేట్ చేయగలదు.
సుమారు రెండు వారాల క్రితం జపాన్ నుండి మధ్యప్రాచ్యానికి చేరుకుంది. ట్రిపోలీతో పాటు శాన్ డియాగో నుండి యూఎస్ఎస్ బాక్సర్ సహా మరిన్ని నౌకాదళ యూనిట్లను ఈ ప్రాంతానికి పంపించబోతోంది పెంటగాన్. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో 11,000కు పైగా లక్ష్యాలు ఛేదించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

సైనిక కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరించింది. భూతల దళాలు లేకుండానే లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంలో ఉన్నామంటూ ఇదివరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ప్రకటించినప్పటికీ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పదాతి దళాలను మోహరింపజేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేయగా 10 మంది యూఎస్ సిబ్బంది గాయపడ్డారు.
యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీలు రంగంలోకి ప్రవేశించాయి. ఇజ్రాయెల్‌పై క్షిపణి ప్రయోగానికి బాధ్యత వహించాయి. సూయజ్ కాలువకు కీలకమైన గ్లోబల్ ట్రేడ్ మార్గమైన బాబ్ ఎల్-మండబ్ జలసంధి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోన్నాయి. ఆయా తాజా పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అమెరికా తాజాగా ఆర్మీని మోహరింపజేయాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. కొత్త శక్తులు రంగంలోకి దిగుతుండటంతో సుదీర్ఘంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
-
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
Canada పౌరసత్వం.. మీ తాతల వారసత్వంతో సాధ్యం! -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి.. -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు.












Click it and Unblock the Notifications