భారత్ కు బిగ్ షాక్.. 1,563 మంది భారతీయులు వెనక్కి పంపిన ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) నినాదంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో భారీ విక్టరీ సాధించారు. అగ్రరాజ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే అందించాలన్న నిర్ణయంతో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిని తిరిగి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని ముమ్మరంగా సాగించారు.

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు. అనంతరం వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీలను బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గడచిన 6 నెలల్లో 1,563 మంది భారతీయులను అక్కడి అధికారులు అమెరికా నుంచి వెనక్కి పంపించారని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 15 వేల మందికి పైగా భారతీయులను ఇప్పటివరకు బహిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

US Deports 1 563 Indians in 6 Months Says Indian Ministry of External Affairs

ఇక భారత్- అమెరికా మధ్య జూన్ 26 నుంచి జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు చివరిదశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ భారత్ పై తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జులై 31 లోపు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్ పైన ట్రంప్‌ ప్రభుత్వం మూడు నెలల క్రితం 26 శాతం టారిఫ్ లు విధించింది. కానీ వాటిని 90 రోజులపాటు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు టారిఫ్ లను తగ్గించే విషయంలో అమెరికా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు ఫలిస్తే ప్రస్తుతం ఉన్న 26 శాతం టారిఫ్ లు 20 శాతం కంటే దిగువకు తగ్గిపోతాయని భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, లోహాల వంటి కీలక రంగాల్లో ఈ తగ్గింపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ కు మాత్రం ఇది ఒక ప్రత్యేకమైన అవకాశంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+