మళ్లీ ప్రచార పర్వంలోకి ట్రంప్... నేడు వైట్ హౌస్ బాల్కనీ నుంచి ప్రసంగం..

ఇటీవల కరోనా బారినపడటంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామమిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రచార పర్వంలోకి దూకనున్నారు. శనివారం(అక్టోబర్ 10) నుంచి ఆయన ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా శనివారం వైట్ హౌస్ బాల్కనీ నుంచి 'శాంతి భద్రతలు' అంశంపై ప్రసంగించనున్నారు. ఈ సభకు వందల సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందరూ మాస్కులు ధరించే ఇందులో పాల్గొనున్నారు.

ఇక సోమవారం ట్రంప్ సెంట్రల్ ఫ్లోరిడాలో క్యాంపెయిన్ చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా అవుట్ డోర్‌లో జరుగుతుందా... ఇండోర్‌లో జరుగుతుందా అన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో రెండో అధ్యక్ష ఎన్నికల డిబేట్‌కు ట్రంప్ 'నో' చెప్పారు. దీంతో అక్టోబర్ 15న జరగాల్సిన ఈ డిబేట్ రద్దయింది. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో చివరిదైన మూడో డిబేట్ అక్టోబర్ 22న జరగనుంది.

 US Election 2020 : Donald Trump to resume campaigning from today

నిజానికి ట్రంప్ మిలటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటికీ ఆయన అనారోగ్యంపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన వైరస్ నుంచి పూర్తిగా కోలుకోలేదని... ఎన్నికల క్యాంపెయిన్స్‌లో పాల్గొంటే ఆయన ద్వారా ఇతరులకు వైరస్ సోకే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్‌‌కు హాజరయ్యేవారికి టెంపరేచర్ చెక్ చేయడం,మాస్కులు అందించడం,శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు.

Recommended Video

    Bihar Elections 2020 : Key Issues in Nitish Vs Tejashwi Row | NDA alliance VS Mahagathbandhan

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+