వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ ఈస్ట్‌కోస్ట్: తొలి ఫలితాల్లో ట్రంప్ దూకుడు: న్యూయార్క్ రిజల్ట్ ఇదీ: ఎలక్టోరల్ ఓట్లలో

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అద్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రారంభ ఫలితాల్లో ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. దూకుడు కనపరుస్తున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు తన ప్రత్యర్థి కంటే డొనాల్డ్ ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు కనిపించినప్పటికీ.. వాస్తవ ఫలితాల వద్దకు వచ్చే సరికి అంచనాలను తలకిందులు చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో పాగా వేశారు. కొన్ని చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఊహించినట్టే- డొనాల్డ్ ట్రంప్‌నకు డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ట్రంప్‌నకు ధీటుగా ఆయన విజయాలను సాధిస్తున్నారు.

వర్జీనియా రిజల్ట్స్: పంచుకున్న డొనాల్డ్ ట్రంప్..జో బిడెన్: ఎవరెక్కడ విజయం సాధించారంటే?వర్జీనియా రిజల్ట్స్: పంచుకున్న డొనాల్డ్ ట్రంప్..జో బిడెన్: ఎవరెక్కడ విజయం సాధించారంటే?

 యూఎస్ ఈస్ట్‌కోస్ట్

యూఎస్ ఈస్ట్‌కోస్ట్


అమెరికా ఈస్ట్‌కోస్ట రీజియన్ పరిధిలోని రాష్ట్రాల్లో తొలి ఫలితాలు వెలువడ్డాయి. ఈ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ దూకుడును ప్రదర్శించారు. ఆయనకు ధీటుగా బిడెన్ విజయాలను అందుకున్నారు. అలబామా, మిస్సిస్సిపి, ఓక్లహామా, టెన్నెస్సీ, అర్కాన్సాస్, సౌత్ కరోలినా, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వర్జీనియా, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మస్సాచుసెట్స్, డెల్వర్‌లల్లో జో బిడెన్ గెలుపొందారు. ఎలక్టోరల్ ఓట్లలో డొనాల్డ్ ట్రంప్ వెనుకంజలో ఉన్నారు.

ఎలక్టోరల్ ఓట్లల్లో బిడెన్ ఆధిక్యత..

ఎలక్టోరల్ ఓట్లల్లో బిడెన్ ఆధిక్యత..


ఎలక్టోరల్ ఓట్లల్లో జో బిడెన్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడెవరనే విషయాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించే ఓట్లు ఇవి. ఇప్పటిదాకా జో బిడెన్‌కు 119 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌నకు 92 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 270. దీన్ని ఎవరు సాధిస్తారనేది క్రమంగా తేటతెల్లం అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన స్టేట్స్‌లల్లో ఎలక్టోరల్ ఓట్లు తక్కువగా పడుతున్నాయి. అదే సమయంలో- జో బిడెన్ గెలుపొందిన రాష్ట్రాల్లో వాటి సంఖ్య అధికంగా ఉంటోంది.

ట్రంప్ ఖాతాలో మరో మూడు రాష్ట్రాలు.. న్యూయార్క్ ఎవరి వశం..

ట్రంప్ ఖాతాలో మరో మూడు రాష్ట్రాలు.. న్యూయార్క్ ఎవరి వశం..

పెద్ద రాష్ట్రాలైన సౌత్ డకోటా, నార్త్ డకోటాలను డొనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకున్నారు. నెబ్రస్కా, వ్యోమింగ్‌లల్లోనూ రిపబ్లికన్ పార్టీ పాగా వేసింది. అదే సమయంలో అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో జో బిడెన్ విజయం సాధించారు. న్యూయార్క్‌లో బిడెన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ స్టేట్‌లో ఆయనకు 29 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. న్యూ మెక్సికో స్టేట్ కూడా డెమోక్రాట్ల వశమైంది. అత్యధిక రాష్ట్రాలు రిపబ్లికన్ల చేతుల్లో వెళ్తున్నందున దానికి అనుగుణంగా ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉందిని విశ్లేషిస్తున్నారు. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు తక్కువగా పోల్ కావడం వెనుకంజలో ఉన్నారని చెబుతున్నారు.

English summary
US President and Republican candidate Donald Trump and Democratic Candidate Joe Biden have each carried numerous Eastern states they were expected to win. Votes are being counted in swing states including Florida and Georgia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X