వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ గెలిస్తే..గ్యాంబ్లర్లు ఎంత నష్టపోతారో తెలుసా? ఆశలన్నీ జో పైనే: బ్రిటన్‌లో బెట్టింగ్

|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై భారీగా బెట్టింగులు తెగుతున్నాయి. లక్షా, పది లక్షలో కాదు.. కోట్ల రూపాయల మేర బెట్టింగులు నమోదవుతున్నాయి. బెట్టింగులకు చట్టబద్ధత ఉన్న అనేక దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి- బ్రిటన్‌లో అమెరికా అగ్రరాజ్య పీఠంపై కళ్లు తిరిగే రేంజ్‌లో బెట్టింగులు సాగుతున్నాయి. భారతీయ కరెన్సీతో పోల్చుకుంటే వేర్వేరు దేశాల్లో కనీసం వంద కోట్ల రూపాయల మేర బెట్టింగులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ఒకే గ్యాంబ్లర్.. ఒక మిలియన్ యూరోల బెట్ పెట్టాడంటే.. వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ బిడెన్: రేస్ టు 270: పీఠం ఎవరిది? అగ్రరాజ్యంలో ఏం జరగబోతోంది?డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ బిడెన్: రేస్ టు 270: పీఠం ఎవరిది? అగ్రరాజ్యంలో ఏం జరగబోతోంది?

 బిడెన్ వైపే మొగ్గు..

బిడెన్ వైపే మొగ్గు..


ప్రపంచ వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన గెలుస్తాడనే ధీమాతో ఉన్నారు. పోలింగ్ ముందస్తు సరళి కూడా అదే సూచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిడెన్ గెలుస్తాడంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే 8 నుంచి 10 శాతం మేర లీడ్ సాధిస్తున్నారంటూ అమెరికన్ మీడియా చెబుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌కు పరాభవం తప్పదంటూ సంకేతాలు అందుతున్నాయనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

బ్రిటన్‌ కేంద్రంగా..

బ్రిటన్‌ కేంద్రంగా..

ఈ పరిస్థితుల్లో బిడెన్‌పై భారీ ఎత్తున బెట్టింగులను కాస్తున్నారు గ్యాంబ్లర్లు. అమెరికాలో బెట్టింగ్‌కు చట్టబద్ధత లేదు. అక్కడ బెట్టింగ్ కార్యకలాపాలపై నిషేధం ఉంది. అదే బ్రిటన్‌లో దానికి చట్టబద్ధత ఉంది. అందుకే- అక్కడి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలను కేంద్రబిందువుగా చేసుకుని బెట్టింగ్ రాయుళ్లు కొన్ని దేశాలకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నారు. అధ్యక్ష ఎన్నికలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. బ్రిటన్‌కు చెందిన ఓ గ్యాంబ్లర్ ఏకంగా ఒక మిలియన్ యూరోల బెట్టింగ్ పెట్టాడు. జో బిడెన్ గెలిస్తే సరి.. లేదంటే అతను కోల్పోయే నగదు భారత కరెన్సీతో పోల్చుకుంటే.. 9,65,28,670 రూపాయలు.

ఇప్పటికే 284 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర

ఇప్పటికే 284 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర

బ్రిటన్ కేంద్రంగా ఇప్పటికే 284 మిలియన్ డాలర్ల మేర విలువ చేసే బెట్టింగులు కొనసాగుతున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఆ మొత్తంలో చాలామటుకు జో బిడెన్‌పైనే తెగాయని అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ ఎక్స్‌ఛేంజ్ ప్లాట్ ఫామ్ బెట్ ఫెయిర్ ఎక్స్‌ఛేంజ్ వేదికగా ఆ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు చట్టబద్ధత ఉందట. జో బిడెన్ నూతన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే వారి పంట పండినట్టేనని చెబుతున్నారు. జో బిడెన్ గెలిస్తే.. 6,96,170 డాలర్ల మేర మొత్తాన్ని బెట్టింగ్ రాయుళ్లు బెనిఫిట్ పొందుతారని తెలుస్తోంది.

Recommended Video

US Election 2020 : Trump - Joe Biden మధ్య టఫ్ ఫైట్.. అధ్యక్ష రేసులో ఆధిక్యం దిశగా ఆ నేత!
2016 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే..

2016 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే..


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించిన 2016 నాటితో పోల్చుకుంటే.. బ్రిటన్‌లో ఈ సారి ఈ మొత్తం మరింత పెరిగిందని అంచనా. 2016లో డొనాల్డ్ ట్రంప్-హిల్లరీ క్లింటన్ మధ్య 199 మిలియన్ యూరోల మేర బెట్టింగులు సాగాయి. ఈ సారి ఆ మొత్తం భారీగా పెరిగింది. 284 మిలియన్ యూరోలకు చేరుకుంది. బ్రెగ్జిట్ సమయంలో నిర్వహించిన బెట్టింగుల కంటే ఈ మొత్తం చాలా అధికం. బ్రెగ్జిట్ సమయంలో 113 మిలియన్ యూరోల మేర బెట్టింగులు నమోదు అయ్యాయి. పోల్ సర్వేల ఆధారంగానే వారంతా జో బిడెన్ విజయంపై భారీ మొత్తాన్ని బెట్టింగ్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.

English summary
Democratic Presidential Candidate Joe Biden supporter in the United Kingdom stands to lose as much £1 million if Donald Trump wins. While betting on elections is illegal in the US, the same is a big market for gamblers in UK's legal betting market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X