వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

|
Google Oneindia TeluguNews

అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే ప్రతీ నిర్ణయం దాదాపు అన్ని దేశాలపై ఏదో ఒకమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టే.. అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. కరోనా విలయం తర్వాత ప్రపంచం గతి పూర్తిగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో టెన్షన్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. ప్రజాస్వామ్య బద్ధమే అయినప్పటికీ.. అత్యంత సుదీర్ఘంగా సాగడంలోనేకాదు.. ఇతర దేశాలతో పోల్చుకుంటే క్లిష్టతరమైనదిగానూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిలుస్తాయి. మూడో పార్టీకి తావు లేకుండా అక్కడి రాజకీయ వ్యవస్థలో రెండే పార్టీలు(రిపబ్లికన్, డెమొక్రాట్లు) పోటీలో ఉంటాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..

Recommended Video

US Election 2020 : Electoral College Is Key Factor,All you Need to Know| #USpresidentialpolls

బైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ' మెలానియాతో ఢీబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -'ఫస్ట్ లేడీ' మెలానియాతో ఢీ

నవంబర్ 3న పోలింగ్..

నవంబర్ 3న పోలింగ్..

నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆ రోజు నవంబర్ 3న రానుంది. మంగళవారం పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బ్యాలెట్ ద్వారా ప్రక్రియ చేపట్టడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇక కీలకమైన ఓటింగ్ విధానాన్ని పరిశీలిస్తే..

 ఏనుగు వర్సెస్ గాడిద

ఏనుగు వర్సెస్ గాడిద

అమెరికాలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ(జీవోపీ)గా పేరుపొందిన రిపబ్లికన్ పార్టీకి ఎన్నికల గుర్తు ఏనుగు. సంప్రదాయ విధానాలకు మొగ్గు చూపించే ఈ పార్టీ పన్నుల సరళీకరణ,తుపాకులకి లెసైన్స్, వలసదారుల నియంత్రణ ప్రధాన ఎజెండాలు. అబార్షన్ హక్కుల్ని వ్యతిరేకిస్తుంది ఈ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. ఇక, ఎన్నికల గుర్తు గాడిదగా ఉండే డెమొక్రాట్ పార్టీ.. ఆధునిక భావాలకు, లెఫ్టిస్ట్ ధోరణికి ప్రతీకగా నిలుస్తుంది. వలసదారులకు మద్దతుగా ఉంటుండటంతో ఆసియా, ఆఫ్రికన్ మూలాలున్నవారంతా డెమోక్రాట్లకు సంప్రదాయ ఓటర్లుగా ఉంటున్నారు. జాతి వివక్ష వంటి చర్యల్ని వ్యతిరేకిస్తుంది. అబార్షన్ హక్కులకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తుంది. పట్టణ ప్రాంత ప్రజలు ఈ పార్టీకి బలం ఎక్కువ.

ఓటేసేది ట్రంప్, బైడెన్‌కు కాదు..

ఓటేసేది ట్రంప్, బైడెన్‌కు కాదు..

ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ బెడైన్ పోరు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ నిజానికి అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష విధానంలోనే జరుగుతుంది. ప్రజలు.. అధ్యక్ష అభ్యర్థులకు నేరుగా ఓట్లు వేయరు. అమెరికాలో రాష్ట్రాలే ఎక్కువ శక్తిమంతమైనవి. ఓటర్లు తమ రాష్ట్రాల్లోని రిపబ్లికన్ లేదంటే డెమొక్రాటిక్ పార్టీ ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు. రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలకి(హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్, సెనేట్) కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 435 మంది సభ్యులుండే సర్వ ప్రతినిధి సభకి రెండేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్లకి మరోసారి జరుగుతాయి. ఇక కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో 100 స్థానాలున్నాయి. వీటిలో 33 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. వీరి పదవీకాలం ఆరేళ్లు. కీలకమైన..

ఎలక్టోరల్ ఓట్లే కీలకం..

ఎలక్టోరల్ ఓట్లే కీలకం..

జనాభాకు అనుగుణంగా అమెరికాలోని 50 రాష్ట్రాలకు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయిస్తారు. ఇవి అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా ఉండవు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్షుడిగా గెలవాలంటే ఆ అభ్యర్థికి 270కి తక్కువ కాకుండా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావాలి. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే కేటాయిస్తారు. అలా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి అధ్యక్షుడు అవుతారు. ఇక్కడ మనం మరో కీలకమైన విషయాన్ని చెప్పుకోవాలి..

 పాపులర్ ఓట్లు ఎక్కువొచ్చినా ఫలితం వేరు..

పాపులర్ ఓట్లు ఎక్కువొచ్చినా ఫలితం వేరు..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా లాభం ఉండదు. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ వచ్చినవారే విజేతలుగా నిలుస్తారు. గత(2016) ఎన్నికల్లో రిపబ్లికన్ క్యాండిడేట్ ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి 28 లక్షల పాపులర్ ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధికంగా ఉండే కీలక రాష్ట్రాల్లో హిల్లరీ కంటే ట్రంప్‌కి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనకే అధ్యక్ష పీఠం దక్కింది. ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లతో పీఠమెక్కగా, హిల్లరీ 232 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫలితాల్లో స్వింగ్ రాష్ట్రాలే కీలకం

ఫలితాల్లో స్వింగ్ రాష్ట్రాలే కీలకం

మంగళవారం(నవంబర్ 3న) పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెడతారు. ఫలితాల ట్రెండ్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాలను వదిలేస్తే.. ఆఖరి నిమిషంలో ఓటుపై నిర్ణయం తీసుకునే వాటిని స్వింగ్ రాష్ట్రాలు అంటారు. వీటి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అత్యంత ముఖ్యం కావడంతో తటస్థంగా ఉండే రాష్ట్రాలనే రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. అరిజోనా (11 ఎలక్టోరల్ ఓట్లు), నార్త్ కరోలినా (15), ఫ్లోరిడా (29) పెన్సిల్వేనియా (20), మిషిగావ్ (16), విస్కాన్సిన్ (10) లను ఈసారి ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే 101 ఎలక్టోరల్ ఓట్లు ఎటు వైపు వస్తాయో ఉత్కంఠ రేపుతోంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. చివరికి..

 గెలిచినా రెండున్నర నెలలు ఆగాలి..

గెలిచినా రెండున్నర నెలలు ఆగాలి..

బుధవారం(నవంబర్4) నాటికి అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేలిపోతుంది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే సదరు వ్యక్తులు బాధ్యతలు స్వీకరించలేరు. కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి రెండున్నర నెలలు గడువు ఇస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ (అమెరికా కాంగ్రెస్) భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి ఎన్నికైన అధ్యక్షుడు వైట్‌హౌ స్ (అధికారిక నివాస భవనం)కి వెళతారు. ఒక వేళ ట్రంప్ తిరిగి ఎన్నికైతే చివరి తతంగం అవసరం ఉండదు.

సంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనంసంచైత తండ్రి ఎవరు? వీలునామా ఇదే -విజయసాయి వేళ్లు తెగడం ఖాయం -ఎంపీ రఘురామ సంచలనం

English summary
With the campaigning coming to a close on monday, Americans will vote to elect the next President of the United Station on November 3 even as the country struggles to manage the raging coronavirus pandemic, slumping economy, and extreme political divisions. Here is everything you need to know about the 2020 US Presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X