సౌదీ అరేబియాకు పాకిన యుద్ధం: రియాధ్ లో భారీ పేలుళ్లు

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ మంగళవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల వల్ల దూర ప్రాంతంలో ఉండే నివాసాలు సైతం దెబ్బతిన్నాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శక్తిమంతమైన బాంబులు పేలడంతో పలు నివాసాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

US Embassy in Riyadh Targeted by Iranian Drones as Tensions Intensify Donald Trump warning

ఈ దాడులను అమెరికా నిర్ధారించింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తోందని తెలిపింది. రెండు డ్రోన్లు తమ రాయబార కార్యాలయంపై దాడి చేసినట్లు వివరించింది. అటు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ధృవీకరించింది. దాడి అనంతరం దట్టమైన పొగవెలువడింది. మంటలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో రియాద్ అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈ డ్రోన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రతీకారం ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. న్యూస్‌నేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రాయబార కార్యాలయంపై సంభవించిన దాడిని తీవ్రంగా పరిగణిస్తోన్నామని తేల్చి చెప్పారు. అమెరికా ప్రతీకార దాడులకు దిగితే ఎలా ఉంటుందో ఆ దేశానికి తెలిసివస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

దాడి అనంతరం- అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక సూచనలు ఇచ్చింది. రియాద్, జెద్దా, ధమ్రాన్‌లలోని అమెరికన్ పౌరులకు షెల్టర్ ఇన్ ప్లేస్ సలహా జారీ చేసింది. ఎంబసీ పైనే దాడి జరిగినందున తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రాయబార కార్యాలయాన్ని సందర్శించవద్దని పేర్కొంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+