వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో కూతురు వ్యాఖ్యలు: అరకోటి చెల్లించిన తండ్రి

|
Google Oneindia TeluguNews

 US girl's Facebook post costs her dad $80,000
వాషింగ్టన్: తన కూతురు ఫేస్‌బుక్‌లో చేసిన అసంబద్ధ, అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిహారంగా ఓ తండ్రి 80 వేల డాలర్లు అంటే సుమారు అర కోటి రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనను గమనిస్తే ఫేస్‌బుక్‌లో చేసే అసంబద్ధ వ్యాఖ్యలు ఎంతటి తల నొప్పులు తీసుకువస్తాయో తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పాట్రిక్ స్నే(69) ఫ్లోరిడాలోని గులివర్ ప్రిపరేటరీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి రిటైరయ్యారు. కాగా అతని కూతురు డానా అసంబద్ధంగా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి పాట్రిక్ స్నే ఓ కేసు విషయంలో గులివర్ స్కూల్‌పై గెలిచారని, అందు కోసం తన యూరప్ పర్యటనకు గులివర్ స్కూల్ డబ్బులు చెల్లిస్తుందని డానా తన ఫేస్‌బుక్ ఖాతాలో వ్యాఖ్యానించింది. వయసుకు సంబంధించిన కేసులో స్కూల్ యాజమాన్యం స్నేకు 80వేల డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది.

అయితే డానా ఫేస్‌బుక్ ఖాతా వ్యాఖ్యాలను గులివర్ పాఠశాలకు చెందిన 1200 మంది విద్యార్థులు చదివారు. అంతేగాక వారందరూ మిగితా విద్యార్థులకు షేర్ చేశారు. దీంతో డానా వ్యాఖ్యాలను పాఠశాల యాజమాన్యం సీరియస్‌గా పరిగణించింది.

పాఠశాలకు చెందిన మాజీ ఉద్యోగి, ఆయన కుమార్తె కలిసి తమ మధ్య ఉన్న కేసు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని పాట్రిక్ స్నేపై మరో కేసు వేసింది. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు పాట్రిక్ స్నేకు ఆ పాఠశాల చెల్లించాల్సిన 80వేల డాలర్లను రద్దు చేసుకుంది. దీంతో తన కూతురు చేసిన వ్యాఖ్యలకు పాట్రిక్ స్నే 80వేల డాలర్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
A US girl's snarky Facebook post has cost her father $80,000 he had won in a legal settlement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X