అలా చేస్తేనే: పాకిస్తాన్‌కు అమెరికా దిమ్మతిరిగే షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉగ్రవాద నిరోధం పేరుతో అమెరికా నుంచి నిధులు పొందుతున్న పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగే షాక్. అదే సమయంలో భారతీయులకు సంతోషం కలిగిస్తూ, పాక్ కంగుతినేలా అమెరికా ఓ నిర్ణయం తీసుకుంది.

తగ్గకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: భారత్‌కు చైనా వార్నింగ్

తమ ప్రధాన రక్షణ భాగస్వామి అయిన భారత దేశంతో మరింత సైనిక సహకారం కోరుకుంటున్నట్లు అమెరికా తన రక్షణ బడ్జెట్లో తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి గాను 62,150 కోట్ల డాలర్ల రక్షణ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.

జాతీయ భద్రతా అధికార చట్టం(ఎన్‌డీఏఏ) 2018 కింద మూడు శాసన సవరణలను అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనల్లో రెండింటిని కాంగ్రెస్‌ సభ్యుడు దానా రోహ్రబచెర్‌ తీసుకురాగా, మరో ప్రతిపాదనను టెడ్‌ పోయ్‌ తీసుకొచ్చారు.

అమెరికాతో పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సంబంధాలకు ముగింపు పలికేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఓ అడుగు ముందుకు వేసిందని టెడ్‌ పోయ్‌ అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఉత్తర వజిరిస్థాన్‌లోని హక్కాని నెట్‌వర్క్‌పై పాకిస్థాన్‌ సైనిక దళాలు పోరాటం చేయకపోతే అమెరికా నుంచే వచ్చే 400 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు ఇవ్వకుండా నిలిపివేస్తారు.

పాకిస్థాన్‌- అఫ్గాన్‌ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికలను నియంత్రించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకోవాల్సిందిగా టెడ్‌పోయి పలుమార్లు ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.

గతంలోను టెడ్ పోయ్...

గతంలోను టెడ్ పోయ్...

గతంలోనూ పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పరిగణించాలంటూ టెడ్‌ పోయ్‌ అప్పటి ఒబామా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అందుకోసం ఆన్‌లైన్‌ వేదికగా ఓ పిటిషన్‌ను వేయగా ఈ ప్రతిపాదనకు చాలామంది తమ మద్దతు తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పిటిషన్‌ను ఒబామా తిరస్కరించారు.

పురోగతి చూపిస్తే నిధులు

పురోగతి చూపిస్తే నిధులు

ఇదిలా ఉండగా, సవరణల సందర్భంగా పాకిస్తాన్‌కు మొట్టికాయలు కూడా వేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో సంతృప్తికరమైన పురోగతి చూపిస్తే తాము నిధులు ఇస్తామని స్పష్టం చేసింది.

అమీ బేరా ప్రతిపాదన

అమీ బేరా ప్రతిపాదన

మరోవైపు, భారత్‌తో సహకారాన్ని పెంపొందించే సవరణను భారత్ - అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా ప్రతిపాదించారు. దానిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

ప్రజాస్వామ్య దేశాలు

ప్రజాస్వామ్య దేశాలు

అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యమని, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత ముందుకెళ్లాలని అమీబేరా అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The US House of Representatives has passed a bill to develop a strategy for advancing defence cooperation between the United States and India.
Please Wait while comments are loading...