Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వార్తల్లోకెక్కిన తాలిబన్లు: అమెరికా ఇంటర్ ఏజెన్సీతో: మాటలతో కాదు చేతల్లో..!

వాషింగ్టన్: చాలాకాలం తరువాత తాలిబన్లు మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించకున్న తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం నెలకొంటోంది. ప్రధానమంత్రి, ఇతర మంత్రివర్గాన్ని ప్రకటించిన తరువాతా కొన్ని అనూహ్య పరిణామాలు తలెత్తడంతో తాలిబన్లు ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తోన్నాయి. కరడుగట్టిన మతఛాందసవాదులుగానే ఉన్నారని, వారిలో ఎలాంటి మార్పు రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయి.

 చెప్పేదొకటి..చేసేదొకటి..

చెప్పేదొకటి..చేసేదొకటి..

తాలిబన్ల వైఖరి పట్ల అగ్రరాజ్యం అమెరికా అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తాలిబన్లు మాటల్లో చెప్పేదొకటి.. చేసేదొకటిగా భావిస్తోంది. సైనిక బలగాల ఉపసంహరణ కోసం తాలిబన్లతో కుదిరిన ఒప్పందాల సమయంలో తాలిబన్లు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కార్యాచరణ రూపం దాల్చలేదని అమెరికా చెబుతోంది. ఖతర్ రాజధాని దోహాలో ముఖాముఖి భేటీ సందర్భంగా తాలిబన్లు ఇచ్చిన భరోసా మేరకే అమెరికా.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన సైనిక బలగాలను వెనక్కి పిిలిపించుకుంది. అమెరికా సైన్యం స్వదేశానికి తిరుగుముఖం పట్టిన మరుక్షణం నుంచీ అక్కడ ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

 హామీలు అమలు కావట్లే

హామీలు అమలు కావట్లే

తమ దురాక్రమణను మొదలు పెట్టారు తాలిబన్లు. దాన్ని విజయవంతం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి సహా ఇతర మంత్రివర్గాన్ని ప్రకటించుకున్నారు. షరియా చట్టం సహా రెండు దశాబ్దాల కిందటి పరిపాలనను గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరి అమెరికాకు మింగుడు పడట్లేదు. ఇప్పటికే- ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పేట్రేగిపోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటోంది అమెరికా. తాలిబన్లు దోహాలో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావట్లేదనే నిర్ణయానికి వచ్చింది.

మరోసారి చర్చలు

మరోసారి చర్చలు

అందుకే- మరో దఫా తాలిబన్ లీడర్లతో చర్చలకు సిద్ధపడింది. దీనికి దోహా మరోసారి వేదిక కానుంది. అమెరికా ఇంటర్ ఏజెన్సీ ప్రతినిధుల బృందం ఇప్పటికే దోహాకు చేరుకుంది. 9,10 తేదీల్లో యూఎస్ ఇంటర్ ఏజెన్సీ ప్రతినిధుల బృందం దోహాకు బయలుదేరి వెళ్లిందని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఆప్ఘనిస్తాన్ పౌరులకు భద్రత కల్పించడం, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించకపోవడం, మానవ హక్కులను అమలు చేయడం, సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం అనే ప్రధాన అంశాలపై దోహాలో చర్చిస్తామని ఆయన వివరించారు. తాలిబన్లు తమవంతు సహకారాన్ని అందించాల్సి ఉందని చెప్పారు.

ప్రజాస్వామ్యబద్ధంగా పాలన

ప్రజాస్వామ్యబద్ధంగా పాలన

ఆప్ఘనిస్తాన్ పౌరులకు తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో నేరుగా సహాయాన్ని అందిస్తున్నామని, తాలిబన్ లీడర్లు సహకరిస్తే- ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాల్సి ఉందని, దీనికోసం తాము తాలిబన్లతో మరోమారు చర్చలకు సిద్ధపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎవరి జోక్యం తీసుకోకూడదంటూ.. నెడ్ ప్రైస్ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండో దఫా చోటు చేసుకునే చర్చలు సానుకూల వాతావరణంలో ముగుస్తాయని భావిస్తున్నామని అన్నారు.

Recommended Video

    Taliban Requests India To Resume Commercial Flights To Afghanistan || Oneindia Telugu
    తాలిబన్లలో మార్పు వస్తుందా?

    తాలిబన్లలో మార్పు వస్తుందా?

    ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత అమెరికా వారితో చర్చలకు దిగడం ఇది మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ఇదే దోహాలో కుదిరిన శాంతి ఒప్పందాల తరువాతే- అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దాని తరువాత ఆప్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం, మానవ హక్కులను కాల రాసేలా పరిపాలన సాగిస్తుండటం తెలిసిన విషయమే. ఈ సారి దోహాలో అమెరికాతో చర్చల అనంతరం తాలిబన్లలో ఎలాంటి మార్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+