ఐఎస్ఐఎస్ నాయుకుడిపై యుఎస్ బాంబుల దాడి
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) అధికార ప్రతినిధిని లక్షంగా చేసుకుని అమెరికా, ఇరాక్ వైమానిక దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల్లో అతనికి తీవ్రగాయాలై మృత్యువుతో పోరాడుతున్నాడని ఇరాక్ అధికారులు అంటున్నారు.
అబూ అహమ్మద్ అల్ అద్నానీ ఇస్లామిక్ స్టేట్ లో అత్యున్నత స్థాయి హోదాను అనుభవించే వారిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇతను ఇస్లామిక్ స్టేట్ అధికారి ప్రతినిధి. ఇతనే ఇరాక్ లో కీలక పాత్రపోషిస్తున్నాడు.
అబూ అహమ్మద్ అల్ అద్నానీ గొంతు ప్రపంచానికి పరిచయమే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విడుదల చేసిన హెచ్చరికల టేపులు, సందేశాల్లో మాట్లాడింది అబూ అహమ్మద్ అల్ అద్నానీనే. ఇతనిని ఇరాక్ టార్గెట్ చేసుకునింది.
అతను ఎక్కడ తలదాచుకున్నాడు అనే విషయం ఇరాక్ పసిగట్టింది. అమెరికా, ఇరాక్ కమాండోలు సంయుక్తంగా గురువారం వైమానిక దాడులు నిర్వహించారు. బాంబు దాడుల్లో అబూ అహమ్మద్ అల్ అద్నానీకి తీవ్రగాయాలైనాయి.

రక్త స్రావం కూడ ఎక్కువ కావడంతో రక్త మార్పిడి చేస్తున్నట్లు తమ దగ్గర సమాచారం ఉందని ఇరాక్ అధికారులు అంటున్నారు. ఇరాక్ జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ఒకరు ఆ విషయంపై స్పందించారు.
గత నెల రోజుల నుంచి అద్నానీ కదలికలను గమనిస్తున్నామని, గురువారం అతనిని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులు చేశామని అన్నారు. 2005లో అద్నానీని అమెరికా అధికారులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. 2010లో మళ్లి అద్నానీని వదిలి పెట్టారు.
అయినా తీరు మార్చుకోని అద్నానీ పాశ్చాత్య దేశాలకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడని ఇరాక్ ఆపరేషన్ కమాండర్లు అంటున్నారు. మొత్తం మీద అద్నానీ ప్రాణాలతో బయటపడటం కష్టం అని ఇరాక్ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications