జో బిడెన్ టీమ్‌లో కాశ్మీరీ యువతి: వైట్‌హౌస్‌లో కీలక హోదా: ఆ స్ట్రాటజీ ఇక ఆమె చేతుల్లో
వాషింగ్టన్: అమెరికాలో వచ్చే నెలలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో భారతీయుల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్.. ఆ దేశ ఉపాధ్యక్ష పదవిని అందుకోబోతోన్నారు. ఆమె తరువాత- పలువురు భారత సంతతికి చెందిన ప్రముఖులు జో బిడెన్ ప్రభుత్వంలో కీలక పదవులను దక్కించుకంటున్నారు. ఇదివరకు డాక్టర్ వివేక్ మూర్తి, మొన్నటికి మొన్న వినయ్ రెడ్డి, గౌతమ్ రాఘవన్.. అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో కీలక పదవుల్లో నియమితులు అయ్యారు.
చైనాపై తన వైఖరిని స్పష్టం చేసిన జో బిడెన్: ఆ పరిస్థితే వస్తే..ఎందాకైనా: ఈ నాలుగేళ్లలో ఏదైనా
తాజాగా మరొకరికి ఉన్నత పదవి లభించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఐషా షానకు జో బిడెన్ టీమ్‌లో బెర్త్ లభించింది. ఆమెను వైట్‌హౌస్‌లో ఉన్నత హోదాను అప్పగించారు జో బిడెన్. వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ సీనియర్ మేనేజర్‌గా నియమించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ అధికారిక ప్రకటనను ఆయన విడుదల చేశారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా ఆమె పని చేయనున్నారు. ఈ విభాగాధిపతిగా రాబ్ ఫ్లాహెర్టీ నియమితులు అయ్యారు. డిజిటల్ స్ట్రాటజీ విభాగం డైరెక్టర్‌గా ఆయన నియమితులు అయ్యారు.

ఐషా షా.. కాశ్మీర్‌లో జన్మించారు. అనంతరం ఆమె కుటుంబం అమెరికాకు తరలి వెళ్లింది. ప్రస్తుతం ఐషా షా లూసియానాలో నివసిస్తున్నారు. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె డెమొక్రాట్ల తరఫున ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. జో బిడెన్-కమలా హ్యారిస్ క్యాంపెయిన్ టీమ్‌లో డిజిటల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ అడ్వాన్స్‌మెంట్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమెను వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ సీనియర్ మేనేజర్‌గా నియమించారు.
అంతకుముందు జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్పొరేట్ ఫండ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేశారు. సోషల్ ఇంపాక్ట్ కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంస్థ బుయోయ్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా విధులను నిర్వర్తించారు. వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీలో ఐషా షాతో పాటు ప్లాట్‌ఫాం మేనేజర్‌గా బ్రెండన్ కోహెన్, డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా మహ ఘన్‌డోర్, వీడియో డైరెక్టర్‌గా జొనాథన్ హోబర్ట్ నియమితులు అయ్యారు. జైమె లోపెజ్, కెహర్నా మాగ్‌వుడ్, అబ్బే ఫిట్జర్, ఒలీవియా రైస్నర్, రెబెక్కా రింకెవిచ్, క్రిస్టియన్ టామ్, కామెరాన్ ట్రింబల్.. అపాయింట్ అయ్యారు.