• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా మెరుపుదాడి: బిన్ లాడెన్ వారసుడి హతం: రగులుతున్న తాలిబన్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా మరోసారి మెరుపుదాడులకు దిగింది. గుట్టు చప్పుడు కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌పై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్లతో దాడులు చేపట్టింది. భయానక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను చేపట్టింది యూఎస్. ఇందులో విజయం సాధించింది. అల్ జవహరిని మట్టుబెట్టింది. ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహణ, అల్ జవహరి మరణించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధృవీకరించారు. డ్రోన్ దాడిలో అతను మరణించినట్లు ప్రకటించారు.

 కాబుల్‌లో నివాసం..

కాబుల్‌లో నివాసం..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పడ్డాక అల్ జవహరి ఇటీవలే బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. రాజధాని కాబుల్ సమీపంలోని షెర్పూర్ ప్రాంతంలో నివసిస్తోన్నాడు. కొంతకాలంగా అతని కోసం అమెరికా వేట కొనసాగిస్తోంది. సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో గడిపిన జవహరి షెర్పూర్ ప్రాంతంలో నివసిస్తోన్నట్లు పసిగట్టింది. 71 సంవత్సరాల జవహరి- భార్య, మనవళ్లతో షెర్పూర్‌లోని ఓ బంగళాలో నివసిస్తున్నట్లు గుర్తించింది.

డ్రోన్లతో అటాక్..

డ్రోన్లతో అటాక్..

అతణ్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులను చేపట్టింది. అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ- పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ సాగింది. ఈ ఆపరేషన్ నిర్వహిస్తోన్నట్లు అక్కడి తాలిబన్ ప్రభుత్వానికి కూడా తెలియదు. షెర్పూర్ నివాసం బాల్కనీలో కొంతమంది అనుచరులతో మాట్లాడుతుండగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ ఘటనలో జవహరి హతం అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన బలగాలను ఉపసంహరించుకున్న తరువాత అమెరికా చేపట్టిన ఓ ప్రధాని దాడి ఇదే.

 ధృవీకరించిన తాలిబన్..

ధృవీకరించిన తాలిబన్..

ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ కూడా నిర్ధారించారు. కిందటి నెల 31వ తేదీన షెర్పూర్‌లో చోటు చేసుకున్న వైమానిక దాడుల్లో జవహరి మృతిచెందినట్లు చెప్పారు. జవహరి ఒక్కడే మరణించాడని, అతని కుటుంబ సభ్యులు గానీ, సాధారణ పౌరులకు గానీ ఎలాంటి హాని కలగలేదని పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నామని చెప్పారు. అమెరికా ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించడం అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

 లాడెన్ వారుసుడిగా..

లాడెన్ వారుసుడిగా..

ఒసామా బిన్ లాడెన్ తరువాత అల్‌ఖైదాకు అధినేతగా ఎదిగాడు అల్ జవహరి. అతను ఈజిప్షియన్. ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థను నెలకొల్పాడు. 1990లో దీన్ని అల్‌ఖైదాలో విలీనం చేశాడు. 2011లో అల్ ఖైదా చీఫ్‌గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచీ అతనే ఈ ఉగ్రవాద సంస్థను నడిపిస్తోన్నాడు. వృత్తిరీత్యా అతను డాక్టర్. బిన్ లాడెన్‌కు వ్యక్తిగత ఫిజీషియన్‌గా పని చేస్తుండేవాడు. 1998లో టాంజానియా, కెన్యాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై ఉగ్రవాదులు జరిపిన దాడలకు అతనే సూత్రధారి.

ఆఫ్ఘన్‌లో

ఆఫ్ఘన్‌లో

గతంలో పాకిస్తాన్ సహా వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. తాలిబన్ల దురాక్రమణ తరువాత అతను ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే నివసిస్తోన్నాడు. ప్రారంభంలో అజ్ఞాతంలో ఉన్నప్పటికీ.. క్రమంగా బాహ్యం ప్రపంచంలోకి వచ్చాడు. భార్య, మనవళ్లతో కలిసి షెర్పూర్‌లో నివసిస్తోన్నాడు. అల్‌ఖైదాకు చెందిన మూలాలు ఏవీ ఉండకూడదనే ఉద్దేశంతోనే అమెరికా అతణ్ని హతమార్చినట్లు చెబుతున్నారు.

కీలక నాయకుడి హతం..

కీలక నాయకుడి హతం..

అల్ జవహరి మృతి చెందిన విషయాన్ని జో బైడెన్ ధృవీకరించారు. సీఐఏ నిర్వహించిన డ్రోన్ల దాడిలో అతను మరణించినట్లు వివరించారు. ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి ఓ ప్రకటన చేశారాయన. అల్ ఖైదాను రూపుమాపాలనేది తమ లక్ష్యమని, ఇందులో మరో అడుగు ముందుకు వేశామని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సి ఉందని, అందుకే ఈ కౌంటర్ టెర్రరిజం వీకెండ్ ఆపరేషన్‌‌ను చేపట్టామని పేర్కొన్నారు.

English summary
The United States killed al Qaeda leader Ayman Al-Zawahri in a drone strike. US President Joe Biden confirms the attack and death of Al-Zawahri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X