భారత్ పై 100% టారిఫ్.. !!

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో రష్యాపై మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడానికి అమెరికా సన్నాహాలు చేపట్టింది.

రష్యా నుండి ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తోన్న భారత్ సహా మరో 10 దేశాలపై 100 శాతం టారిఫ్ ను విధించడానికి చర్యలు తీసుకుంది. దీనిపై సెనెట్.. ఓ బిల్లును సైతం ఆమోదించింది. రష్యాకు కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఇంధన అమ్మకాలను పూర్తిగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో రూపొందించిన బిల్లు ఇది. ఇందులో పలు కీలక సవరణలు చోటు చేసుకున్నాయి.

US lawmakers submitted amendments to the Russia sanctions bill Naming India and other 10 Countries

ఇందులో భాగంగా.. భారత్ సహా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఇతర దేశాల పేర్లను చేర్చింది. ఇందులో భారత్, చైనా, టర్కీ, అజర్ బైజాన్, హంగేరి, సింగపూర్, స్లొవాక్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లక్ దేశాల పేర్లు ఉన్నాయి. ఆయా దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌ విధించే అపరిమితమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి కల్పించడానికి ఈ బిల్లు అవకాశం కల్పించింది.

మీ ఉద్యోగం పోయింది: టెక్కీలకు దడ పుట్టించిన మెయిల్
మీ ఉద్యోగం పోయింది: టెక్కీలకు దడ పుట్టించిన మెయిల్

కిందటి నెల 7వ తేదీన అమెరికా సెనేట్ ఈ లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ బిల్లును 86-11 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. చమురు పరిమాణం ఆధారంగా అయిదు అతిపెద్ద దిగుమతిదారులు.. అనే పదాన్ని మాత్రమే చేర్చారు. డెమోక్రాటిక్ సభ్యుడు స్టెనీ హోయర్ ఇందులో కొన్ని సవరనలను ప్రతిపాదించారు.

టీమిండియా గట్టి ఎదురుదెబ్బ: బౌలర్ అవుట్
టీమిండియా గట్టి ఎదురుదెబ్బ: బౌలర్ అవుట్

చమురు పరిమాణం ఆధారంగా అయిదు అతిపెద్ద దిగుమతిదారులు..అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో నేరుగా ఆయా దేశాల పేర్లను పొందుపర్చాలని ప్రతిపాదించారు. ఈ దిశగా సవరణలను సూచించారు. దీనికి సెనెట్ అంగీకరించింది. ఆయా దేశాల పేర్లను నేరుగా బిల్లులో పొందుపర్చింది. హోయర్ ప్రతిపాదించిన సవరణ ప్రకారం భారత్ సహా ఆయా దేశాల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ సవరణలతో కూడిన బిల్లు నవంబర్ 3వ తేదీ లోపు సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంది.

డెమొక్రాటిక్ కే చెందిన మరో సభ్యుడు గ్రెగరీ మీక్స్ మాత్రం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోన్నారు. రష్యా భాగస్వామ్య దేశాలపై 100 శాతం టారిఫ్ విధించడానికి డొనాల్డ్ ట్రంప్‌కు విశేష అధికారాలు కల్పించే సెక్షన్ 113 నిబంధనను ఈ బిల్లు నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన కోరారు. అధ్యక్షుడికి ఇటువంటి ఏకపక్ష వాణిజ్య అధికారాలు ఇవ్వడం వల్ల అంతర్జాతీయ భాగస్వాములతో అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని ఆయన చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+