వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారిస్ ర్యాలీకి గైర్హాజరు: ఒబామాపై అమెరికా మీడియా విమర్శలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ప్యారిస్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా ప్యారిస్‌లో నిర్వహించిన భారీ ర్యాలీకి గైర్హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఆ దేశ మీడియా విమర్శల వర్షం కురిపించింది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ర్యాలీలో ఒబామా హాజరుకాకపోవడం పట్ల మీడియా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ప్యారిస్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, టర్కీ, ఇజ్రాయిల్, పాలస్తీనా టెరిటోరీస్ ప్రతినిధులతోపాటు 44 దేశాలకు చెందిన ప్రతినిధులు, లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 1944 జర్మనీ నాజీల నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్యారిస్‌లో ఇంత పెద్ద ర్యాలీ జరగలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

ప్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఓ పత్రికా కార్యాలయంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు మూడు రోజులపాటు కాల్పులు జరిపి 17మందిని హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం ఫ్రాన్స్ భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఆ ఉగ్రవాదులు హతమయ్యారు.

 US media slams President Obama for skipping Paris rally

కాగా, ఆదివారం జరిగిన ప్యారిస్ ర్యాలీకి అమెరికా నుంచి అమెరికా అంబాసిడర్‌ అయిన జాన్ హార్ట్లీని పంపించింది. అయితే దీనిపై అమెరికా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన అంతపెద్ద ర్యాలీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఒబామా కాకపోయినా అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ లాంటి ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

బరాక్ ఒబామా ఎక్కడ? ఆయన ఎక్కడికెళ్లారు? అంటూ యుఎస్ మీడియా ప్రశ్నలు సంధించింది. 50కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఆ ర్యాలీకి ఒబామా వెళ్లేందుకు నిరాకరించడం విచారకరమని వెల్లడించాయి. ఒబామా ర్యాలీకి వెళ్లికపోవడంపై అమెరిక ప్రతిపక్షం కూడా విమర్శలు గుప్పించింది. కాగా, ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం స్పందించలేదు.

అయితే దాడి అనంతరం వైట్‌హౌజ్ నుంచి ఓ సందేశం వెలువడింది. ఫ్రాన్స్ ప్రజలకు ఈ రోజు, రేపు ఎల్లప్పుడూ అమెరికా అండగా ఉంటుందని ఈ సందేశంలో పేర్కొంది. ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో ఉగ్రవాద సమస్య, ప్రపంచ భద్రత అంశాలపై అధ్యక్షుడు ఒబామా ఓ సమావేశం నిర్వహిస్తారని వైట్ హౌజ్ తెలిపింది.

ఇది ఇలా ఉండగా జాన్ కెర్రీ అంతకుముందే నిర్ణయించుకున్నట్లుగా భారతదేశ పర్యటనకు వచ్చారు. దీంతో ఆయన ర్యాలీకి హాజరుకాలేకపోయారు. అలాగే యుఎస్ అటార్నీ జనరల్ ఎరిక్ యూరోపియన్ భద్రతా ప్రత్యర్థులపై ప్యారిస్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం వల్ల ఆయన కూడా ర్యాలీకి హాజరుకాలేకపోయారు.

English summary
The absence of President Barack Obama or any top members of his administration from a huge march in Paris on Sunday to honour victims of Islamist militant attacks raised eyebrows among some in the US media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X