ట్రంప్ గుడ్ బై.. నాయకత్వ ఖాళీ ఎవరికి లాభం?

అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనం.. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో ఒక పెనుమార్పు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితం విసిరిన బాణం ఇప్పుడు లక్ష్యాన్ని చేరింది. ఏడాది నోటీసు పీరియడ్ ముగియడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా బయటకు వచ్చేసింది. ఇది కేవలం ఒక సంస్థ నుండి వైదొలగడం మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య భద్రతలో ఒక బిగ్ టర్న్ అనే చర్చ మొదలైంది.

ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ప్రధాన కారణం డబ్బు, రాజకీయం. "ప్రపంచం మొత్తం అమెరికాను దోచుకుంటోంది, WHO అందుకు మినహాయింపు కాదు" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి. చైనా జనాభా అమెరికా కంటే మూడు రెట్లు ఉన్నప్పటికీ, వారు చెల్లించే విరాళం అమెరికా కంటే 90 శాతం తక్కువగా ఉండటంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19 సమయంలో WHO వ్యవహరించిన తీరు, చైనాకు అనుకూలంగా ఉందనే ఆరోపణలు ఈ నిర్ణయానికి ఆజ్యం పోశాయి. సంస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందని వైట్‌హౌస్ మెమోలో ఘాటుగా పేర్కొన్నారు.

US Officially Exits WHO

నిధుల 'కోత'.. ప్రాణాలకు 'ముప్పు'?

అమెరికా నిష్క్రమణ WHOపై పెను ప్రభావాన్ని చూపనుంది. ఏటా 160 మిలియన్ల నుండి 815 మిలియన్ డాలర్ల వరకు నిధులు అందించే అతిపెద్ద దాతను కోల్పోవడం వల్ల.. దాదాపు అంతం కావచ్చిన పోలియో మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. కొత్త వైరస్‌లను గుర్తించే 'గ్లోబల్ సర్వైలెన్స్' వ్యవస్థ బలహీనపడవచ్చు. టీకాలు, సాంకేతిక సాయం కోసం WHOపై ఆధారపడే వెనుకబడిన దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ.

నాయకత్వ ఖాళీ - ఎవరికి లాభం?

"నిజమైన సంస్కరణలు రావాలంటే సంస్థలో ఉండి పోరాడాలి కానీ, వదిలి వెళ్లడం పరిష్కారం కాదు" అని ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ టామ్ ఫ్రీడెన్ హెచ్చరించారు. అమెరికా వైదొలగడం వల్ల ప్రపంచ ఆరోగ్య నిర్ణయాల్లో ఆ దేశం తన వాయిస్ కోల్పోతుంది. ఈ ఖాళీని భర్తీ చేయడానికి చైనా లేదా ఇతర దేశాలు ప్రయత్నిస్తే, అంతర్జాతీయ ఆరోగ్య దౌత్యం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

WHO ఆవేదన.. ఆశావహం!

అమెరికా నిర్ణయంపై WHO భావోద్వేగంగా స్పందించింది. "1948లో సంస్థ స్థాపన నుండి అమెరికా మాకు వెన్నెముకగా ఉంది. మశూచిని అంతం చేశాం, పోలియోను తరిమికొట్టే దశకు చేరాం. అమెరికా తన నిర్ణయాన్ని పునరాలోచిస్తుందని ఆశిస్తున్నాం" అని పేర్కొంది.

ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం దేశీయంగా ఆయన మద్దతుదారులను ఖుషీ చేయవచ్చు కానీ, అంతర్జాతీయంగా మాత్రం అమెరికాను ఒంటరిని చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు 228 మిలియన్ల డాలర్లు బాకీని చెల్లించకుండానే వైదొలగడం ఇప్పుడు మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచం మరో మహమ్మారి ముంగిట నిల్చుంటే.. సమన్వయం చేసే నాయకుడు లేని స్థితికి ఇది దారితీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+