భారత్- రష్యా మధ్య చిచ్చు పెట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ కు చెందిన తన కౌంటర్ పార్ట్ వోలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. లంచ్ మీటింగ్ ఇది. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటైంది. సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగింది. యుద్ధాన్ని నిలిపివేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రష్యాపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి అవసరమైన సహాయక చర్యలను జెలెన్‌స్కీ ఆశించినప్పటికీ.. దానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించలేదు. ఆయుధాలను మరింత బలోపేతం చేయడానికి లాంగ్ రేంజ్ తొమాహాక్ క్షిపణులను పొందాలని ప్రతిపాదించగా.. దీన్ని ట్రంప్ తిరస్కరించారు. ఇది ఇబ్బందికరంగా ఉందని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు యుద్ధాన్ని నిలిపివేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సయోధ్య లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని జెలెన్‌స్కీ, పుతిన్‌కు కూడా చెప్పానని వివరించారు. వారిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, ఇది శాంతి ఒప్పందానికి ఆటంకం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి తాను పరిష్కరిస్తానని, శాశ్వత ముగింపు పలుకుతానని ఈ సందర్భంగా ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
తన పాలనా కాలంలో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని ట్రంపు పునరుద్ఘాటించారు. రువాండా- కాంగో, భారత్-పాకిస్తాన్.. ఇలా వివిధ దేశాల మధ్య తలెత్తిన యుద్ధాలను సమయస్ఫూర్తితో నివారించగలిగానని చెప్పారు. అలా జరిగిన ప్రతిసారీ నోబెల్ శాంతి బహుమతి వస్తుందని చెప్పేవారని, ఆ అవార్డు దక్కకపోవడం నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆ పురస్కారం ఓ మహిళకు రావడం మంచి పరిణామమని చెప్పారు. ఇవన్నీ తాను పట్టించుకోనని, ప్రాణాలను రక్షించడమే ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఏ అమెరికన్ అధ్యక్షుడైనా గానీ ఒక్క యుద్ధాన్ని కూడా పరిష్కరించలేదని పేర్కొన్నారు ట్రంప్. ఆ ఘనత తనకు దక్కిందని, అతి తక్కువ కాలంలో 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడానని వివరించారు. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగివుంటే అది అనేక దారుణాలు, విపత్కర పరిస్థితులకు దారి తీసి ఉండేదని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బ్యాడ్ బ్లడ్ గా అభివర్ణించారు.
అత్యంత సంక్లిష్టమైన మిడిల్- ఈస్ట్ దేశాల సమస్యను పరిష్కరించిన అనుభవం తనకు ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొన్నారు. 59 దేశాలతో కూడిన సంక్షోభాలను సైతం సులభంగా పరిష్కరించానని గుర్తుచేశారు. ఈ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీకి ఒక్కరోజు ముందే పుతిన్‌తో టెలిఫోన్ లో సుదీర్ఘంగా సంభాషించానని గుర్తు చేశారు. ఆయన కూడా పరిష్కారాన్నే కోరుకుంటున్నారని చెప్పారు.
రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని, ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై భారత్ ఇక రష్యా చమురును కొనదు అని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ వెంటనే జరగదని, త్వరలోనే ముగుస్తుందని అన్నారు. సెంట్రల్ యూరప్‌లోని పరిస్థితులతో భారత్ నిర్ణయాన్ని పోల్చారు. హంగేరీ వంటి దేశాలు ఒకే ఒక పైప్‌లైన్‌పై ఆధారపడి, సముద్ర మార్గం లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications