ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని గిఫ్ట్: ప్రతిష్ఠాత్మక మిలటరీ అవార్డ్: గుర్తుగా
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని బహుమానం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ బహుమానాన్ని ప్రకటించారు. మరి కొద్దిరోజుల్లో మాజీ కాబోతోన్న డొనాల్డ్ ట్రంప్..ప్రధానికి ప్రతిష్ఠాత్మక లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నరేంద్ర మోడీ కృషి చేసినందుకు గుర్తుగా ఆయనకు ఈ అవార్డు లభించింది.
అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ.. ప్రధాని తరఫున ఈ అవార్డును అందుకున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ దీన్ని ఆయనకు అందజేశారు. ప్రపంచదేశాల్లో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశానికి సారథ్యాన్ని వహిస్తోన్న నరేంద్ర మోడీకి ఈ అవార్డును అందజేయడం తనకు గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా రాబర్ట్ పేర్కొన్నారు. లీజియన్ ఆఫ్ మెరిట్‌ను అమెరికా మిలటరీ విభాగంలో అత్యున్నత అవార్డుగా భావిస్తారు. సాధారణంగా ఈ అవార్డును అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు అందజేస్తుంటారు.
“President @realDonaldTrump presented the Legion of Merit to Indian Prime Minister Narendra Modi for his leadership in elevating the U.S.-India strategic partnership. Ambassador @SandhuTaranjitS accepted the medal on behalf of Prime Minister Modi.” –NSA Robert C. O’Brien pic.twitter.com/QhOjTROdCC
— NSC (@WHNSC) December 21, 2020
ఇదివరకు ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబెలకు ప్రదానం చేశారు. ఈ సారి ఈ అవార్డు కోసం నరేంద్ర మోడీని ఎంపిక చేశారు. అమెరికా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని మోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అవిశ్రాంతంగా కృషి చేశారని రాబర్ట్ పేర్కొన్నారు. దౌత్య, వ్యూహాత్మక సంబంధాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ హయాంలో డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

దానికి గుర్తుగా లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును మోడీకి అందజేసినట్లు తెలిపారు. ఇప్పటిదాకా నరేంద్ర మోడీకి పలు దేశాలు అత్యున్నత పురస్కారాలను ఇచ్చాయి. సౌదీ అరేబియా-అబ్దులజీజ్ అల్ సౌదీ, ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్, గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఆర్డర్ ఆఫ్ జయేద్ అవార్డ్, రష్యా-ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, మాల్దీవులు-రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ పురస్కారాలు లభించాయి.












Click it and Unblock the Notifications