• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంకో 10 రోజులు: అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్: తొలి ఇంజెక్షన్ లిస్ట్‌ రెడీ: ఎవరెవరి పేర్లు?

|

వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అల్లాడుతోంది అమెరికా. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా వైరస్‌కు బలి అయ్యారు. అక్కడి కేసులు కోటిన్నర మార్క్‌ను ఎప్పుడో దాటేశాయి. ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా తీవ్రత లేదు. ఈ పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇదివరకే ఫుడ్ అండ్ డగ్స్ అథారిటీకి చెందిన నిపుణుల ప్యానెల్ ఇదివరకే అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి వ్యాక్సిన్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ప్రారంభం కానుంది.

  Pfizer COVID-19 vaccine: Biggest Vaccination Drive in US History తొలిదశ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్..!

  2020: అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా: ఒక్క టర్మ్‌లోనే ఓడిన అధ్యక్షుడిగా మిగిలిన ట్రంప్

   లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్.. మైక్ పెన్స్

  లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్.. మైక్ పెన్స్

  కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే జాబితాను కూడా అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వారిద్దరితో పాటు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు చెందిన కొందరు కీలక అధికారుల పేర్లను కూడా ఈ లిస్ట్‌లో చేర్చారు. వైట్‌హౌస్‌ అత్యవసర సర్వీసుల విభాగం, భద్రతా సిబ్బంది సహా మూడు విభాగాలకు చెందిన అధికారులకు తొలిదశలో ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ఇంజెక్షన్ ఇవ్వనున్నారు.

  డాక్టర్ల సలహా తరువాతే..

  డాక్టర్ల సలహా తరువాతే..

  డొనాల్డ్ ట్రంప్.. ఇదివరకే కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. మేరీల్యాండ్‌లోని సైనిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. కరోనా నుంచి వేగంగా కోలుకోగలిగారు. ఇప్పటికీ ఆయన దీనికి సంబంధించిన చికిత్సను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఇప్పటికిప్పుడు ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను ఎప్పుడు ఇస్తారనేది తెలియరాలేదు. తొలిదశలోనే ఆయనకు వ్యాక్సిన్ఇ ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ఇది డాక్టర్ల సలహా మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

   జో బిడెన్, కమలా హ్యారిస్‌లకూ

  జో బిడెన్, కమలా హ్యారిస్‌లకూ

  కొత్త అధ్యక్షుడు జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లకు ఫైజర్ వ్యాక్సిన్ ఎప్పుడిస్తారనే విషయం ఇంకా ఖరారు కాలేదు. జో బిడెన్ వ్యక్తిగత సలహాదారుల నిర్ణయం, వారు నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం దీన్ని నిర్ధారిస్తారని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్యక్రమం సోమవారం అమెరికాలో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా మొత్తం 145 పాయింట్లకు వ్యాక్సిన్‌ను చేరవేస్తారు. అనంతరం దాని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికోసం ఫెడెక్స్, యూపీఎస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

   ఆర్మీ సారథ్యంలో..

  ఆర్మీ సారథ్యంలో..

  ఫైజర్ వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమం మొత్తాన్నీ అమెరికా ఆర్మీ అధికారులు పర్యవేక్షించనున్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఇది కొనసాగుతుంది. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ (ఓడబ్ల్యూఎస్) పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తొలిదశ కింద మూడు మిలియన్ల డోసులను పంపిణీ చేస్తామని చెప్పారు. తొలి వ్యాక్సిన్ ఇంజెక్షన్‌ను ఎవరికి ఇవ్వబోతున్నారనేది ఇంకా తెలియరాలేదు. హెల్త్‌కేర్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

  మిచిగాన్‌లోని ఫైజర్ ప్లాంట్ నుంచి

  మిచిగాన్‌లోని ఫైజర్ ప్లాంట్ నుంచి

  ఫైజర్ కంపెనీకి మిచిగాన్‌లోని కలామజూలో వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ ఉంది. తొలిదశ వ్యాక్సిన్ డోసులతో కూడుకున్న వాహనాలు ఇక్కడి నంచే బయలుదేరి వెళ్లనున్నాయి. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మెక్‌కెస్సన్, ఫార్మా ఛైన్ కంపెనీలు సీవీఎస్, రైట్-ఎయిడ్ వంటి కంపెనీలు తరలింపులో పాల్గొంటున్నాయి. ఫెడెక్స్, యూపీఎస్ సంస్థల వాహనాలను వారు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ అమెరికన్ ఆర్మీ పర్యవేక్షిస్తోంది. ఒక్కో వాహనంలో మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రత సామర్థ్యంతో కూడిన రిఫ్రెజిరేటింగ్ వ్యవస్థ ఉంది.

  English summary
  President Donald Trump, Vice President Mike Pence and other top U.S. officials will be offered the newly approved COVID-19 vaccine beginning on Monday as part of a plan aimed at ensuring the continuity of government, a source familiar with the plans said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X