వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్ ఓ యుద్ధ నేరస్తుడు-బుచ్చా దురాగతాలే నిదర్శనం-బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ లో రష్యా అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బుచ్చా నగరంలో తాజాగా బయటపడిన రష్యా సైనికుల దురాగతాలపై అంతర్జాతీయంగా ఆగ్రహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ దురాగతాలకు బాధ్యుడిని చేస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని ఆయన కోరారు.

ఉక్రేనియన్ పట్టణం బుచాలో పౌరులపై జరిగిన అకృత్యాలపై ప్రపంచవ్యాప్త ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ నేరాల విచారణ జరగాల్సిందేనని బైడెన్ తెలిపారు. రాజధాని కైవ్ శివార్లలోని బుచాలో ఊచకోతలకు సంబంధించిన నివేదికల నేపథ్యంలో రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని కోరుతున్నట్లు చెప్పారు.

US president joe biden says Bucha atrocities show Putin is ‘war criminal’

రష్యా నియంత్రణలో ఉన్న పట్టణ వీధుల్లో శవాల ఫోటోలు అంతర్జాతీయంగా విమర్శలకు తావిచ్చాయి. దీనిపై విశ్వసనీయ దర్యాప్తు కోసం ఇప్పటికే పలు దేశాలు పిలుపునిచ్చాయి.పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా పిలిచినందుకు తనను విమర్శించారని, కానీ ఇప్పుడు బుచాలో నిజం బయటపడిందని బైడెన్ వ్యాఖ్యానించారు.

గత నెలలో పుతిన్ ను యుద్ధనేరస్తుడిగా అభివర్ణిస్తూ బైడెన్ చేసిన వ్యాఖ్యలపై క్రెమ్లిన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికాతో తమ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. అయినా బైడెన్ మాత్రం మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఇతర యీఎస్ అధికారులు, ఏజెన్సీలు కూడా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపించాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఉక్రెయిన్‌లో కొన్ని రష్యన్ దళాలు అధికార దుర్వినియోగం చేశాయని అధికారికంగా నిర్ధారించింది. బైడెన్ వాషింగ్టన్ యుద్ధ సమయంలో చేసిన ఆరోపణ ఉల్లంఘనలకు యుద్ధ నేరాల విచారణను నిర్వహించాలని కోరుతున్నారు.

English summary
US president joe biden has made severe comments on russian counterpart vladimir putin over his soldiers' attrocities on ukrainians in bucha city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X