Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాపై కోపం అంతకంతకు పెరుగుతుందన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... రీజన్ ఇదే !!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ వ్యాప్తిపై తాను చైనాపై మరింత కోపంగా ఉన్నానని పేర్కొన్నారు . అమెరికన్ ఆరోగ్య అధికారులు కరోనా మహమ్మారిని పూర్తిగా నియంత్రణ చెయ్యలేమని చెప్పారు. అమెరికాలో కరోనాతో పెరుగుతున్న మరణ మృదంగం చూసి తీవ్ర అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు తన ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది అని పేర్కొన్నారు .

కరోనా మహమ్మారి పంజా విసురుతూ ప్రపంచమంతటా వ్యాప్తి చేయడాన్ని, రోజు రోజుకూ దారుణంగా పరిస్థితులు మారటాన్ని తాను చూస్తున్నానని పేర్కొన్న ట్రంప్ అది యుఎస్ఎకు చేసిన భారీ నష్టంతో తాను చైనాపై మరింత కోపంగా ఉన్నాను అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్రంప్ చైనా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

 US President Trump says More and more angry at China, as corona death toll rises

ఇక యూఎస్ లో కరోనా కంట్రోల్ కోసం ఎంతగా ప్రయత్నం చేసినా కేసులు మాత్రం ఘోరంగా పెరుగుతున్నాయని , ఇప్పటికే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని, మహమ్మారిని అణిచివేసేందుకు అధికారులు మరియు ప్రజలు చర్యలు తీసుకోకపోతే కేసులు రోజుకు రెట్టింపు 100,000 కు పైగా ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.

Recommended Video

    #IndiaChinaFaceOff : India-China మధ్య ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన Donald Trump || Oneindia

    కరోనా నియంత్రణ సాధించలేమని అమెరికా‌ వైద్యులు ట్రంప్‌కు తెలిపారు. ఇక దీంతో తీవ్ర అసహనంలో ఉన్న ట్రంప్ చైనాపై తన కోపం అంతకంతకూ రెట్టింపు అవుతుందని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+