వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ పై అమెరికా సీరియస్-తటస్ధం పేరుతో రష్యాకు మద్దతా ? దౌత్యమార్గాల్లో తీవ్ర అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ లో తమ దేశ పౌరులు అష్టకష్టాలు పడుతున్నా ఆ దేశానికి మద్దతివ్వకుండా తటస్ధ వైఖరి పేరుతో రష్యాకు అండగా నిలవడంపై యూఎస్ వంటి దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తన అసంతృప్తిని భారత దౌత్యవేత్తలకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Russia Ukraine Conflict : తటస్ధం పేరుతో Russia కు మద్దతా ?భారత్ పై Joe Biden | Oneindia Telugu
 రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ తటస్ధం

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ తటస్ధం

రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న పోరులో భారత్ తటస్ధ వైఖరి అవలంబిస్తోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ అంశాల్లో భారత్ అనుసరిస్తున్న వైఖరి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ కొనసాగింది. దీంతో ఈ పోరులో ఇరుదేశాలకూ మద్దతివ్వకుండా ఐరాసలో సైతం తటస్ధవైఖరితో ఉండటం, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తుండటం అమెరికా, దాని మిత్రదేశాలకు నచ్చడం లేదు. అయినా ఏమీ చేయలేని పరిస్దితి. దీంతో నేరుగా యుద్ధంలో దిగకపోయినా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలు భారత్ పై పెదవి పిరుస్తున్నాయి.

 భారత్ పై అమెరికా గుర్రు

భారత్ పై అమెరికా గుర్రు

ఉక్రెయిన్ తో రష్యా సాగిస్తున్న పోరులో బలహీనమైన ఉక్రెయిన్ కు అండగా నిలవాల్సింది పోయి తటస్ధం పేరుతో ఇరుదేశాలకు సమానదూరం పాటించాలన్న భారత్ నిర్ణయం అమెరికా, దాని మిత్రదేశాలకు మింగుడు పడటం లేదు. భారత్ తో పాటు యూఏఈ కూడా ఇప్పుడు ఇదే వైఖరిని అనుసరిస్తోంది. రష్యాతో చిరకాల స్నేహం నేపథ్యంలో భారత్, యూఏఈ ఈ తటస్ధ వైఖరి అనుసరిస్తున్నట్లు అమెరికా అనుమాని

 తటస్ధం పేరుతో రష్యాకు మద్దతిస్తారా ?

తటస్ధం పేరుతో రష్యాకు మద్దతిస్తారా ?

భారత్ తో పాటు యూఈఏ కూడా ఉక్రెయిన్ విషయంలో కలిసి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న యూఎస్.. మీరిద్దరూ రష్యా క్యాంప్ లో ఉన్నారా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భారత్ తటస్ధ వైఖరి వల్ల ఉక్రెయిన్ కంటే రష్యాకే ఎక్కువగా మేలు జరుగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఐరాస భద్రతామండలితో పాటు సాధారణ సభలోనూ రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ప్రవేశపెడుతున్న తీర్మానాలకు, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటం సహజంగానే పుతిన్ కు కలిసొస్తోంది. దీంతో ఆయన ఇప్పటికే భారత్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు. దీంతో ఈ విషయంలో అమెరికా తమ దౌత్య మార్గాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
US seems to be serious on india and uae's stand on russia-ukraine crisis and said they werew in russia's camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X