వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు సహకరించండి: పాక్ కు అమెరికా వార్నింగ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యాకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల వివరాలు వెల్లడించాలని అమెరికా సూచించింది. తాలిబన్ ఉగ్రవాద సంస్థతో పాటు మిలిగిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అది పాకిస్థాన్ కే ముప్పు అని అమెరికా చెప్పింది.

ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ ను అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ హెచ్చరించారు. 26/11 దాడుల కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరించాలని పాకిస్థాన్ కు సూచించారు. భారత్ అధికారులకు ముంబై దాడుల కేసులో పూర్తిగా సహకరించాలని గతంలోనే తాము పాక్ కు సూచించామని మార్క్ టోనర్ గుర్తు చేశారు.

US says it wants justice, asks Pakistan to cooperate with India

పాకిస్థాన్ తన పద్దతి మార్చుకోకుండా ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన మీడియాకు చెప్పారు. ఇప్పటికే పాక్ లో పలువురు ఉగ్రవాద సంస్థల నాయకులు, ఉగ్రవాదులు అంతం అయ్యారని, అయినా తమకు ఏమి తెలీదని పాక్ పాతపాట పాడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

English summary
Asserting that the US is continuing the process of having talks with Pakistan to address all terror outfits operating on their soil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X