Sub Marine: గల్లంతైన వెంటనే సబ్ మెరైన్ పేలిపోయింది.. కానీ.!

అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన మినీ సబ్ మెరైన్ కథ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి సంబంధంచి అమెరికా ఓ కీలక విషయం బయటప పెట్టింది. ఆదివారం రాడర్ తో మినీ సబ్ మెరైన్ కమ్యూకేషన్ కోల్పోయిన వెంటనే అది పేలిపోయినట్లు.. అందుకు సంబంధించి శబ్ధాలు వచ్చినట్లు వెల్లడించింది. యూఎస్ నేవీ వినియోగించే సిక్రెట్ శబ్ద పర్యవేక్షణ వ్యవస్థ ఈ శబ్దాలను గుర్తించినట్లు పేర్కొంది.

సీక్రెట్ US నావికాదళం నీటి అడుగున మైక్రోఫోన్‌లు ద్వారా ఆదివారం టైటాన్ సబ్ పేలుడును గుర్తించిందని ఓ అధికారి తెలిపారు. సబ్ మెరైన్ తప్పిపోయన వెంటనే పేలుడు శబ్దాలు వచ్చినట్లు వివరించారు. టైటానిక్ షిప్ శిథిలాల నుంచి 500 మీటర్ల దూరంలో ఈ పేలుడు శబ్దాలు వచ్చినట్లు చెప్పారు. సబ్ మెరైన్ అదృశ్యమైన వెంటనే ఈ సౌండ్ వచ్చినట్లు పేర్కొన్నారు. యూఎస్ నేవీ వినియోగించే సిక్రెట్ శబ్ద పర్యవేక్షణ వ్యవస్థశత్రు జలాంతర్గాములను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తామన్నారు.

submarine

జాతీయ భద్రతా సమస్యల కారణంగా దీనిని బయటకు చెప్పలేదన్నారు. అయితే ఈ విషయాన్ని గాలింపు చేపట్టిన అమెరికా కోస్ట్ గాడ్ కు చెప్పామని తెలిపారు. "U.S. నావికాదళం అకౌస్టిక్ డేటా విశ్లేషణను నిర్వహించింది. సబ్ మెరైన్ కమ్యూనికేషన్‌లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్‌మెర్సిబుల్ పనిచేస్తున్న సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించింది" అని ఒక సీనియర్ అధికారి ది వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ఒక ప్రకటనలో తెలిపారు.

"ఖచ్చితమైనది కానప్పటికీ, కొనసాగుతున్న శోధన, రెస్క్యూ మిషన్‌లో సహాయం చేయడానికి ఈ సమాచారం వెంటనే ఇన్సిడెంట్ కమాండర్‌తో పంచుకున్నామని" అని వివరించారు. సముద్రంలో గల్లంతైన వారిలో OceanGate Expeditions CEO స్టాక్‌టన్ రష్, పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ సాహసికుడు పాల్-హెన్రీ నార్గోలెట్‌లు ఉన్నారు. వారంతా దాదాపు ప్రాణాలు కోల్పోయినట్లేనని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+