అధికార-ప్రతిపక్షాల మధ్య ఒప్పందం: ముగిసిన అమెరికా షట్ డౌన్
వాషింగ్టన్: అమెరికాలో బడ్జెట్ సంబంధిత ప్రతిష్టంభన తొలగిపోయింది. ప్రభుత్వ కార్యకలాపాలకు తాత్కాలికంగా నిధులు అందించే బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దీంతో మూడు రోజుల షట్ డౌన్‌కు తెరపడింది.
ఈ బిల్లు ఆధారంగా ఫిబ్రవరి 8వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయి. ఇందులో పిల్లల ఆరోగ్య బీమా కార్యక్రమం ఉంది. అయితే డ్రీమర్స్ భద్రత అంశంపై ఈ బిల్లులో చేర్చలేదు. ఈ విషయం పైనే తొలి నుంచి డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు.

ద్రవ్య వినిమయ బిల్లులో డ్రీమర్స్ భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవనే కారణంతోనే డెమోక్రాట్లు మద్దతు ఇవ్వకపోవడంతో బిల్లు సెనేట్‌లో నిలిచింది. ఇది అమెరికా షట్ డౌన్‌కు కారణం అయింది.
మూడు రోజులుగా నిలిచిన పరిపాలన వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు డెమోక్రటిక్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీతో ఒప్పందానికి వచ్చారు. అక్రమ వలసలపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో ఫిబ్రవరి 8 వరకు జరగాల్సిన ఖర్చులకు అనుమతి ఇచ్చే బిల్లుకు ఇరువర్గాలు ఆమోదం తెలిపాయి. దీంతో ప్రభుత్వ సేవలు పునఃప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications