పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలే: తేల్చి చెప్పిన ట్రంప్
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఇరాన్‌పై చేపట్టిన సైనిక కార్యకలాపాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. తన దేశ ఆర్మీని ప్రశంసించారు. పర్షియన్ గల్ఫ్ దేశం ఇరాన్.. తన సైన్యం, నౌకాదళం, కమ్యూనికేషన్లతో పాటు అత్యున్నత స్థాయి నాయకులను సైతం కోల్పోయిందని ప్రకటించారు. వైట్ హౌస్ లో ఏర్పాటైన కాలేజియేట్ స్పోర్ట్స్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. మరో రెండు, మూడు వారాల్లో తాము లక్ష్యాన్ని చేరుకుంటామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లో తమ సైన్యం అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. ఇరాన్ సైన్యం నాశనమైందని, నౌకాదళాన్ని కోల్పోయిందని తెలిపారు. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 32 నౌకలు ఉండగా.. అవన్నీ ఇప్పుడు సముద్ర గర్భంలో సేదతీరుతున్నాయని చెప్పారు. అత్యంత కీలకమైన కమ్యూనికేషన్లను వ్యవస్థలను ధ్వంసం చేయగలిగామని, దీనివల్ల ఆ దేశ సైన్యం యుద్ధాన్ని సమన్వయం చేసుకోలేకపోయిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
దేశ ప్రజల్లో తమ సైనికులు హీరోలు అయ్యారని, వారిని ఆరాధిస్తున్నారని ట్రంప్ అన్నారు. వెనిజులా మొదలుకుని ఇరాన్ వరకు బీ-2 బాంబర్లతో సాగించిన విన్యాసాలను చూసి అమెరికన్లు ముగ్ధురలయ్యారని అన్నారు. తమ దేశ సైనిక శక్తి ఏ పాటిదో ప్రపంచ దేశాలు కళ్లారా చూశాయని, డిఫెన్స్ లో తాము ఎప్పుడూ అత్యున్నత స్థితిలోనే ఉన్నామని ట్రంప్ తెలిపారు.
ఈ యుద్ధంలో తమ సైనిక శక్తి ముందు ఇరాన్ అత్యున్నత స్థాయి నాయకులు సైతం కనుమరుగయ్యారని, ఆ దేశ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ మరణాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దాడుల సందర్భంగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం లేకుండా పోయారని అన్నారు. ఇప్పుడు మూడో శ్రేణి నాయకులు మాత్రమే ఇరాన్ లో మిగిలారని పేర్కొన్నారు.
వాయుసేన పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. దశాబ్దాల కాలంగా ఇరాన్ ను పాలించిన నాయకులు అనేకమంది ప్రజలను హతమార్చారని ఆరోపించారు. అలాంటి నాయకుల్లో చాలామంది మరణించగా.. మరికొందరు అంగవికలురయ్యారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాళ్లు, చేతులు లేకుండా, ముఖాలు ఛిద్రమై తిరుగుతున్నారని పేర్కొన్నారు.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?












Click it and Unblock the Notifications