26/11 mumbai attacks: భారత్ కస్టడీకి తహవూర్ రాణా..
26/11 ముంబయి పేలుళ్లు జరిగి ఇప్పటికి 16 ఏళ్లు దాటింది. 2008లో జరిగిన ఈ దాడులు గురించి తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి భయానక దాడికి పాల్పడిన కీలక సూత్రధారి తహవూర్ రాణా. అయితే ముంబయి ఉగ్రదాడుల కేసులో దోషిగా ఉన్న తహవూర్ రాణాను తాజాగా భారత్ కు అప్పగించేందుకు యూఎస్ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతేడాది నవంబర్ 13న తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన రివ్యూ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
దీంతో తహవూర్ రాణా భారత్ రాక సుగమమైంది. తనను భారత్ కు అప్పగించవద్దంటూ రాణా అనేక కింది స్థాయి కోర్టులు, ఫెడరల్ కోర్టల్లో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ అన్ని కోర్టులూ ఆయన పిటిషన్ ను తిరస్కరించాయి. దీంతో నవంబర్ 13న అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తాజాగా అక్కడ కూడా రాణాకు చుక్కెదురు కావడంతో ఆయన దిల్లీ రావడానికి మార్గం సుగమమైంది.

2008 ముంబయి దాడుల కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న తహవూర్ రాణాది స్వస్థలం పాకిస్థాన్ కాగా అమెరికాలోని కెనడా రాష్ట్రంలో పెరిగాడు. రాణాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎప్పటినుంచో పోరాడుతోంది. మరోవైపు రాణా కూడా తనను భారత్ కు అప్పగించవద్దొంటూ అనేక కోర్టులను ఆశ్రయించి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లోని డిటెన్షన్ కోర్టులో ఉన్నాడు.
లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టు కొలేమాన్ హెడ్లేతో తహవూర్ రాణా సత్సంబంధాలు కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముంబయి దాడులకు ముందు హెడ్లే రూపొందించిన బ్లూప్రింట్ లోనూ రాణా హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని భారత్ కు రప్పించడం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతోంది.
2008, నవంబర్ 26న జరిగిన ముంబయి ఉగ్ర దాడిలో 166 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు విదేశీయులు కూడా ఉన్నారు. 10 మంది పాకిస్థానీ టెర్రరిస్టులు దాదాపు 60 గంటలపాటు జరిపిన భీకర దాడికి పాల్పడ్డారు. ముంబయిలోని కీలకమైన ప్రాంతాల్లో, రద్దీ ప్రాంతాల్లో ఈ దాడులకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications