యూఎస్ లో దారుణం- తనను తినేస్తారనే భయంతో కుటుంబాన్ని చంపేసిన యువకుడు..
యూఎస్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలో తల్లితండ్రులు, పిల్లల్ని అందులో ఓ పిల్లాడు దారుణంగా హతమార్చాడు. విచారణలో పోలీసులకు అతను చెప్పిన విషయాలు షాక్ కు గురి చేశాయి. తనను తినేసేందుకు వారంతా ప్లాన్ చేశారని, ఇది తెలుసుకుని తాను వారిని హతమార్చినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో పోలీసులతో పాటు జనం కూడా ఈ హత్యలపై నిర్ఘాంతపోతున్నారు.
యూఎస్ లోని టెక్సాస్‌లో ఓ 18 ఏళ్ల యువకుడు తన కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. సీజర్ ఒలాల్డే అనే ఈ యువకుడు దారుణంగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. తన తల్లితండ్రులతో పాటు ఐదేళ్ల సోదరుడితో పాటు సోదరినీ చంపేశాడు. దీనంతటికీ కారణం వారంతా కలిసి తనను నరమాంస భక్షకుల్లా తినేసేందుకు ప్లాన్ చేశారనేది ఆరోపణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి తన కుటుంబానికి హాని చేస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని సమాచారం అందింది. సీజర్ ఒలాల్డే ఇంటి లోపల ఉన్నాడని, లోపల చాలా మంది వ్యక్తులు చనిపోయారని చెప్పారని తెలిసింది.

ఇంట్లో అందుబాటులో ఉన్న గన్ ను తీసుకుని కుటుంబ సభ్యుల్ని సీజర్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసాడు. అనంతరం పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు చివరికి అతన్ని లొంగిపోయేలా ఒప్పించారు. తరువాత అతని తల్లిదండ్రులు రూబెన్ ఒలాల్డే, ఐడా గార్సియా, అక్క లిస్బెట్ ఒలాల్డే, తమ్ముడు ఆలివర్ ఒలాల్డే మృతదేహాలను బాత్రూంలో స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నివాసం, బాత్రూమ్‌లోని వివిధ ప్రదేశాలలో వారిని కాల్చి చంపినట్లు తేలింది. ఇంటి అంతస్తు అంతా రక్తసిక్తంగా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.












Click it and Unblock the Notifications