యుద్దం కొనసాగుతున్న వేళ - ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కమల హారీస్ : లక్ష్యం అదేనా..!!
ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. ఒక వైపు చర్చలు అంటూనే..మరో వైపు యుద్దం కొనసాగుతోంది. రోజు రోజుకీ ఉక్రెయిన్ పైన దాడులు పెరుగుతున్నాయి. రష్యా పైన అమెరికా పలు ఆంక్షలు విధించింది. యూకేతో పాటుగా పలు యూరోపియన్ దేశాలు సైతం రష్యా అధ్యక్షుడి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే పుతిన్ నిర్ణయాల పైన తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన రష్యా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు.

కమలా హ్యారీస్ కీలక పర్యటన
ఉక్రెయిన్ పైన ఇంకా రష్యా దాడులు కొనసాగుతున్న సమయం లోనే అమెరికా ఉపాధ్యక్షురాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల పర్యటనకు కమలా హారీస్ వెళ్లాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్..రొమేనియా దేశాల్లో కమలా హరీస్ వచ్చే వారం పర్యటించనున్నారు. ఈ నెల 9 వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య పోలండ్ లోని వార్సావ్.. రొమనేనిమాలోని బుకారెస్ట్ కు కమలా హారీస్ వెళ్లనునున్నట్లు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఇరు దేశాల నేతలతో సమావేశంలో రష్యా అంశంపై మాట్లాడనున్నట్లు చెప్పారు.

ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి
అలాగే ఉక్రెయిన్‌కు భద్రత, ఆర్థిక, మానవతా సాయం వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నట్లు వెల్లడించారు. రష్యా తీరు పైన ఆగ్రహంతో ఉన్న అమెరికా.. రష్యాకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక, మరో వైపు ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్కివ్‌లో వరుస పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. స్థానిక ప్రజలు సమీపంలోని షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపింది. అటు పుతిన్ సేనలు ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు.
Recommended Video

వెనక్కు తగ్గని రష్యా
ప్రధానంగా ఉక్రెయిన్‌లోని ఇంధన, విద్యుత్తు సరఫరాలను దెబ్బతీసేందుకు పుతిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటును సమీపించి, శతఘ్నులను ప్రయోగించారు. ఈ దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారని, ఎలాంటి రేడియేషన్ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. తాజాగా, రష్యాకు చెందిన 50 మంది సంపన్నులు.. వారి కుటుంబ సభ్యలు పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఇక..ఉక్రెయిన్ లో చిక్కుకున్న దాదాపు 20 వేల మంది భారతీయులను కేంద్రం ఆపరేషన్ గంగా ద్వారా స్వదేశానికి తరలించారు.












Click it and Unblock the Notifications