H-1B visa: న్యూ ఇయర్‌లో గుడ్‌న్యూస్ ఇచ్చిన యూఎస్: ఆ నిబంధన సడలింపు: ఆ ఇబ్బంది ఉండదిక
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా హెచ్-1బీ విసాదారులకు గుడ్‌న్యూస్ వినిపించింది. హెచ్-1బీ విసాలను మంజూరు చేసే విధానాన్ని మరింత సరళీకరించింది. కీలకమైన నిబంధనలను సడలించింది. ఈ సడలింపును కొత్త సంవత్సరం నుంచి అమలులోకి తీసుకుని రాబోతోంది. హెచ్-1బీతో పాటు నాన్ ఇమ్మిగ్రేషన్స్ విసాలకు కూడా దీన్ని వర్తింపజేసింది. దీనివల్ల విసాల జారీ మరింత వేగవంతమౌతుంది.
విసాలను మంజూరు చేయడంలో నెలకొంటోన్న జాప్యాన్ని నివారించడానికి, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హెచ్-1బీ విసాలను జారీ చేయడానికి సాధారణంగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటారు యూఎస్ కాన్సులేట్ అధికారులు. విసాలను పొందాలనుకునే వారు ఇన్-పర్సన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నాన్ ఇమ్మిగ్రేషన్ల విషయంలోనూ ఇదే విధానాన్ని అమలులో ఉంది.

దీనివల్ల ఈ విసాల మంజూరు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందనే నిర్ణయానికి వచ్చింది. దీన్ని మరింత సరళీకిరించాలని నిర్ణయించింది. ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ నిబంధనను సడలించింది. ఇకపై హెచ్-1బీతో పాటు కొన్ని రకాల నాన్ ఇమ్మిగ్రేషన్ విసాలను పొందాలనుకునే వారు యూఎస్ కాన్సులేట్ అధికారులు నిర్వహించే ముఖాముఖి ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. 2022 నుంచి దీన్ని అమలులోకి తీసుకుని రానుంది.
కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని, ఫలితంగా- మంజూరు చేయాల్సిన విసాల దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయని పేర్కొంది. వాటన్నింటినీ ఆమోదించడానికి సమయం చాలట్లేదని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్పారు. హెచ్-1, హెచ్-3, హెచ్-4, ఎల్, ఓ, పీ, క్యూ విసాల జారీ ప్రక్రియను దీని పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను నిర్వహించాల్సి రావడం వల్ల మరింత జాప్యానికి కారణమౌతున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ ఇబ్బందిని నివారించడానికి, విసాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తాత్కాలికంగా ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాన్సులర్ అధికారి తుది నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పారు. పర్సన్ ఇన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ (హెచ్-1బీ), విద్యార్థులు, వ్యవసాయం-వ్యవసాయేతర కార్మికులు, స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ విజిటర్స్, అథ్లెట్లు, కళాకారులు, ఎంటర్‌టైన్‌మెంట్ సెగ్మెంట్స్‌కు ఈ మినహాయింపు ఇచ్చామని అన్నారు.












Click it and Unblock the Notifications