మాపై ఒత్తిడి ఉన్నంత కాలం అమెరికాకు షాకులిస్తాం: ఉ.కొరియా
జెనీవా: ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ప్రపంచదేశాలు హెచ్చరిస్తోన్నా కిమ్ వైఖరిలో మార్పు రావడం లేదు. అమెరికాను మరింత రెచ్చగొట్టేందుకుగాను ఉత్తరకొరియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా కానీ పరిస్థితి మార్పు రాలేదు. అమెరికాతో పాటు రష్యా కూడ ఉత్తరకొరియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా వ్యవహరశైలిని ప్రపంచదేశాలు తప్పుబడుతున్నాయి.
యుద్దానికి తాను సిద్దమేనంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్నారు. చైనా కూడ కిమ్ వైఖరిని తప్పుబట్టారు. రష్యా, చైనా కూడ కిమ్‌పై విరుచుకుపడడంతో అమెరికా మిత్ర దేశాలకు మరింత బలం వచ్చినట్టైంది.
అయినా అణుపరీక్షలు, క్షిపణులను ప్రయోగిస్తూ ప్రజలను కిమ్ భయాందోళనలకు గురిచేస్తున్నారు. తన సత్తా ఏమిటో కిమ్ ప్రపంచదేశాలకు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర ఆగ్రహంగా ఉంది.

అమెరికాకు మరిన్ని బహుమతులు
ఓ వైపు ఉత్తరకొరియా ఆగడాలను ఎలా అడ్డుకోవాలని ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు ఆ దేశం ఏ మాత్రం వెనుకాడట్లేదు. అమెరికాను నాశనం చేసే శక్తి తమ వద్ద ఉందంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేసిన ఉత్తరకొరియా.. తాజాగా మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. అమెరికాకు మరిన్ని బహుమతులు పంపేందుకు తమ దేశం సిద్ధంగా ఉంది అని జెనీవాలో ఐక్యరాజ్యసమితికి ఉత్తరకొరియా రాయబారి హన్ తే సంగ్ హెచ్చరించారు.‘ఇటీవల మా దేశం అణు బాంబును విజయవంతంగా పరీక్షించింది. మా దేశాన్ని రక్షించేందుకు చేసిన ఆ పరీక్షను అమెరికాకు బహుమతిగా ఇస్తున్నామన్నారు.

ఒత్తిడి కొనసాగినంత కాలం బహుమతులిస్తాం
అమెరికా మా దేశంపై ఒత్తిడి తెస్తున్నంత కాలం ఇలాంటి బహుమతులు అందుకుంటూనే ఉంటుంది. ఇది అమెరికా చర్యలపైనే ఆధారపడి ఉంటుంది' అని హన్ తే సంగ్ అన్నారు.అమెరికాను రెచ్చగొట్టేలా ఆయన ప్రకటనలు చేశారు. గత ఆదివారం ఉత్తరకొరియా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌బాంబును విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.

అణు పరీక్షలు నిర్వహిస్తున్న కిమ్
హైడ్రోజన్ బాంబు ప్రయోగం కారణంగా 5.7 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. విస్ఫోటం నుంచి వెలువడిన శక్తి 50 నుంచి 60 కిలో టన్నుల వరకూ ఉంటుందని దక్షిణకొరియా వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. కాగా.. ఉత్తరకొరియా తాజా ప్రయోగంపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరకొరియాకు తగిన సమాధానం చెబుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

యుద్దానికి కిమ్ సన్నాహలు
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచదేశాలు యుద్దాన్ని కోరుకొంటున్నాడనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను కిమ్ కవ్విస్తున్నారు. కిమ్ జాంగ్ వున్ యుద్ధం కోసం అడుక్కుంటున్నారని ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కూడ కిమ్ చర్యలను తీవ్రంగా ఖండించింది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications