భారత్‌కు ట్రంప్‌ మరో బిగ్ షాక్.. మరో 25 శాతం సుంకాల మోత !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న కారణంతో భారత్‌పై ఆయన తాజాగా మరో 25 శాతం అదనపు టారిఫ్ (సుంకం)విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పటికే భారత్‌పై అమల్లో ఉన్న 25 శాతం సుంకంతో కలిపితే.. మొత్తం 50 శాతం సుంకం భారత్‌ ఉత్పత్తులపై వసూలవనుంది. కాగా ఇప్పటికే "భారత్‌పై 24 గంటల్లో భారీ చర్యలు ఉంటాయి" అని ట్రంప్ హెచ్చరించగా.. అనుకున్నట్టు గానే వెంటనే చర్యలు తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

సుంకాల అమలుకు తేదీలు ఖరారు..

పాత 25 శాతం సుంకాలు 2025 ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా, కొత్తగా విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో పునరుద్ధరణ చర్యలలో భాగంగా భారత్‌పై ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు.

usa-president-trump-impose-additional-25-percent-tariffs-on-india

మరోవైపు భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటే.. ట్రంప్ ఈ టారిఫ్‌లను మరింత పెంచే అవకాశమూ ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. దీంతో భారత్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి తలెత్తే అవకాశముంది. అయితే భారత్‌ రష్యాతో నేరుగా, పరోక్షంగా చమురు వాణిజ్యం చేస్తోందని, అమెరికా గడ్డపై దీన్ని సహించబోమని" ట్రంప్ స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. "ప్రధాని మోదీ స్నేహితుడనే చెప్పుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు భారత్‌పైనే 50 శాతం టారిఫ్‌ విధించడం ఏం రాజకీయ స్నేహం?" అని మండిపడింది. భారత్‌పై ట్రంప్ పన్నుల వర్షం కురిపిస్తున్నా.. ప్రధాని మాత్రం ఆయన పేరే ప్రస్తావించకపోవడం దారుణమని విమర్శించింది. ఈ మేరకు 'ఎక్స్' లో కాంగ్రెస్ పోస్ట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+