అమెరికాలో కరోనా విలయం.. ఒక్క రోజులో 10 లక్షలకు పైగా కేసులు.. న్యూ ఇయర్ వేడుకలే కారణమా?

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో కంటే మూడు రెట్టు అధికంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. సొమవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్ర‌తతో ఆస్ప‌త్రులన్నీ నిండిపోయాయి. గత వారం రోజుల్లో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్‌ బారినపడినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది.

కరోనా విలయతాండవం..

కరోనా విలయతాండవం..

అమెరికాలో ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ విలయతాండం చేస్తున్నాయి. వైరస్ ఉద్ధృతితో అమెరికన్లకు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. గతంలో పోల్చితే మూడు రెట్లు అధికంగా వైరస్ బాధితుల సంఖ్య పెరిగింది. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ డేటా ప్రకారం ఒక్క రోజులోనే ( సోమవారం) 10,42,000 కరోనా కేసులు నమోదయ్యాయి. గత గురువారం అమెరికాలో ఒక్కరోజే 5.91 లక్షల కేసులు బయటపడ్డాయి. దానికి రెట్టింపు కేసులు ఇప్పుడు నమోదు కావడంతో తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడినట్లు తెలిపింది..

న్యూ ఇయర్ వేడుకలు అమెరికాపై ప్రభావం

న్యూ ఇయర్ వేడుకలు అమెరికాపై ప్రభావం


న్యూఇయర్ వేడుకలే అమెరికాలో కరోనా వ్యాప్తికి కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్పత్రులన్నీ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. లక్షకు పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 18వేల మంది పైగానే ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. గతంలో పరిస్థితి మళ్లీ ఇప్పుడు వస్తుందా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది ఆసుపత్రి చేరగా, వేలాది మంది మృతి చెందారు.

ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా

ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా


అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 5.5 కోట్లమంది కరోనా వైరస్ బారినపడ్డారు. అటు 8.26 లక్ష్క్షల మంది మరణించారు. జాన్ హాప్కిన్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరికి కరోనా సోకిందని వెల్లడించింది. అటు ఇప్పటివరకు 62 శాతం మంది అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు. రెండు డోసులు వేసుకున్న వారు బూస్టర్ డోసులను కూడా తీసుకుంటున్నారు.

 అమెరికా అధ్యక్షుడు సమీక్ష

అమెరికా అధ్యక్షుడు సమీక్ష


కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారిస్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఈ వేరియంట్‌ను అడ్డుకోగ‌లిగే చ‌ర్య‌ల‌పై క‌రోనా వైర‌స్ రెస్పాన్స్ బృందాల‌తో చర్చించారు. అటు అమెరికాలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాల‌యాల‌ను మూసివేశారు. విమానాల‌ సర్వీసులను కూడా చాలావరకు ర‌ద్దు చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జో బిడెన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+