Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిని చూసి నోరు వెళ్లబెడుతున్న జపాన్ ప్రజలు

భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాల్ని తనవైపు తిప్పుకుంది భారత్. భారత్ ఆయుధ సంపత్తి, సైనికుల తెగువ చూసి అవాక్కయ్యాయి. అయితే తాజాగా మరోసారి భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. జపాన్ లో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో భారత్ కు చెందిన వందే భారత్ ఎక్స్ ప్రెస్, చీనాబ్ బ్రిడ్జి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని చూసిన ప్రపంచ దేశాల ప్రజలు వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

జపాన్ ఒసాకా లోని యుమేషిమా అనే ద్వీపంలో వరల్డ్ ఎక్స్ పో- 2025 కొనసాగుతోంది. ఏప్రిల్ 13 న ప్రారంభం అయిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ప్రపంచ దేశాల పర్యటకులు నిత్యం లక్షలాది మంది ఈ ఎక్స్ పోను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ నుంచి ఏర్పాటు చేసిన వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిల కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టూరిస్టులు వీటిని చూసి.. ఆ ప్రాజెక్ట్ ల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చీనాబ్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా చరిత్రలో నిలిచింది.

Vande Bharat and Chenab Bridge Artworks Shine at World Expo 2025 in Osaka

ఒసాకాలోని యుమేషిమా ద్వీపంలో ఏర్పాటు చేసిన ఈ వరల్డ్ ఎక్స్ పో- 2025 అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ లక్షలాది మంది టూరిస్టులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి ప్రపంచ దేశాల కళాకృతులకు ముగ్ధులవుతున్నారు. వీటిల్లో వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిల కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని పోటీపడి మరీ జపాన్ తో పాటు ఇతర దేశాల ప్రజలు తిలకిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ల విశేషాలు తెలుసుకుని ఔరా అంటున్నారు.

ఇదే విషయంపై భారతీయ రైల్వే శాఖ అధికారులు మాట్లాడుతూ.. చీనాబ్ బ్రిడ్జి విశేషాలను ప్రపంచం ముందు ఉంచడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందడంతో ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జితో పాటు దేశంలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జిగా పేరు పొందిన అంజి కధ్ బ్రిడ్జి కళాకృతిని సైతం ప్రదర్శనకు ఉంచినట్లు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+