వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ కుటీల బుద్ది: చర్చలంటూ ఫైటర్ జెట్స్, బాంబర్ల మొహరింపు, భారత్ కూడా..

|
Google Oneindia TeluguNews

గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణతో చైనా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు చర్చలు అంటూనే డ్రాగన్ బలగాలను మొహరిస్తోంది. లడాఖ్‌ వద్ద గల లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్ వద్ద గల పాంగోంగ్ త్సో నదీకి ఉత్తరాన జెట్ విమానాలు, బాంబర్లను రంగంలోకి దింపింది. పరిస్థితిని నిశీతంగా గమనిస్తోన్న ఇండియా కూడా లడాఖ్ ఎల్ఏసీ వద్ద గల 826 కిలోమీటర్ల సరిహద్దుల్లో బలగాలను మొహరించింది.

భారత భూభాగంపైకి చైనా: అక్కడే గుడారాలు: ఘర్షణకు కారణం? శాటిలైట్ ఫొటోస్..రాహుల్ డౌట్స్భారత భూభాగంపైకి చైనా: అక్కడే గుడారాలు: ఘర్షణకు కారణం? శాటిలైట్ ఫొటోస్..రాహుల్ డౌట్స్

 మరోసారి చర్చలంటూ..

మరోసారి చర్చలంటూ..


సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలో నేపథ్యంలో ఈ వారంలో మరోసారి లెప్టినెంట్ జనరల్ జనరల్ స్థాయి అధికారులు చర్చలు జరపనున్నారు. ఈ నెల 6వ తేదీన కూడా ఇరుదేశాల మేజర్ జనరల్ అధికారులు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల తర్వాత పరిస్థితి సద్దుమణుగుతోందని భావించినా.. జూన్ 15వ తేదీన అర్ధరాత్రి డ్రాగన్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాష్టీకానికి పాల్పడడంతో దేశం అట్టుడికిపోతోంది. కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను కొట్టడంతో భరతమాత కోసం వారంతా నెలకొరిగారు.

ఫైటర్ జెట్లు.. బాంబర్లు...

ఫైటర్ జెట్లు.. బాంబర్లు...

ఎల్ఏసీకి సమీపంలో ఫైటర్ జెట్, బాంబర్లను చైనా మొహరించిందని భారత్ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లడాఖ్‌కు ఉత్తరాన గల హాటాన్ జినియాంగ్, లడాఖ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో గల నార్గీ, సిక్కింకు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో గల షిగాట్సే వద్ద ఫైటర్ జెట్లు ఉన్నాయని పేర్కొన్నాయి. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాన గల నియింగ్జి వద్ద కూడా ఫైటర్ జెట్లు ఉన్నాయి.

 భారత్ కూడా

భారత్ కూడా

ఎల్ఏసీ వద్ద గల డెప్సాంగ్, ముర్గో, హాట్ స్ప్రింగ్, కోయిల్, ఫక్సే, డెమ్ చాంగ్ ఫేస్ వద్ద పీఎల్ఏ నుంచి ముప్పు ఉంది. దీంతో భారత్ కూడా అపాచీ హెలికాప్టర్లు, సుఖోయ్ ఫైటర్ జెట్స్, ట్యాంకులను మొహరించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. చైనాకు భారత్ ధీటుగా చర్యలు తీసుకుంటోంది. 14 వేల అడుగుల ఎత్తులో ఆపరేషన్ చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.

English summary
China has added numbers to its air-based offensive platforms along the Line of Actual Control in Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X