విజయ్ మాల్యాకు భారీ ఊరట, చోర్.. చోర్ వ్యాఖ్యలపై షాకింగ్ జవాబు
బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు తాత్కాలిక కోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను న్యాయస్థానం మరో ఆరు నెలలు పొడిగించింది.
లండన్: బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు తాత్కాలిక కోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్‌ను న్యాయస్థానం మరో ఆరు నెలలు పొడిగించింది.
విజయ్ మాల్యాను తిరిగి భారత దేశానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు లండన్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.

ఆరు నెలలు పొడిగింపు
ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువును మరో ఆరు నెలల వరకు (డిసెంబర్ 4) పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అనంతరం కోర్టు బయట విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడారు. తాను నిర్దోషినని చెప్పాడు. భారత సర్కారు తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని చెప్పాడు.

స్టేడియంలో చోర్ చోర్ కామెంట్లపై..
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని, తాను అమాయకుడినని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు ఇంకా సాగుతున్నాయని, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఏ కోర్టు నుంచీ తాను తప్పించుకోలేదన్నారు. న్యాయస్థానంలో హాజరుకావడం తన కర్తవ్యం గనకే కోర్టుకు హాజరయ్యానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నాడు. అంతేకాదు, క్రికెట్ స్టేడియంలో తనను చోర్.. చోర్ (దొంగ.. దొంగ) అంటూ స్టేడియంలో చుట్టుముట్టి గేలి చేసిన సంఘటన పైన కూడా మాల్యా స్పందించాడు.

నాకు మంచి జరగాలని అందరూ కోరుకున్నారు
ఓవెల్ మైదానంలో తనను ఎవరు కూడా దొంగ అని అనలేదని చెప్పాడు. తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని చెప్పాడు. మిగతా వారంతా తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

వారిద్దరికి పొగడ్తలు
క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద తనను అవమానించారన్న మీడియా వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా, మాల్యా అలా చెప్పగానే ఆయనపై అరిచిన ఆ ఇద్దరిని ట్విట్టర్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ ఇద్దరికీ సెల్యూట్ అని పేర్కొంటున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications