వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ మాల్యా కోసం సిద్ధంగా ఉన్న ఆర్థర్ రోడ్డు జైలు బారెక్

|
Google Oneindia TeluguNews

లండన్: బ్యాంకులకు వేలకోట్లు టోపీ పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం ముంబైలోని జైలు బారెక్‌ను సిద్ధం చేసింది. మాల్యాను ఆర్థర్ రోడ్డులోని జైలు బారెక్‌లో ఉంచనున్నారు. ఇది ఇప్పటికే ఆయన కోసం సిద్ధంగా ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

మాల్యా ఇక్కడకు వచ్చాక ఆయన ఆస్తుల వివరాలు చెప్పడం కీలకమని అంటున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్‌తో పాటు మాల్యా తన ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి వాస్తవాలు చెప్పవలసి ఉంటుందని అంటున్నారు.

Vijay Mallyas extradition will speed up trial, jail barrack ready for him: ED

మాల్యాను త్వరలో భారత్ తీసుకు రానున్నట్లు తెలిపారు. ఇతర ఆర్థిక నేరస్థుల కేసుల్లో మాల్యా కేసు ఉదాహరణగా నిలుస్తుందని అంటున్నారు. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. దీనిపై ఆయన ఉన్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకునేందుకు సమయం కూడా ఇచ్చింది.

భారత్‌కు అప్పగించాలన్న కోర్టు నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మాల్యా చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆయనకు రెండు వారాల సమయం ఇచ్చింది. ఆయన దరఖాస్తును కోర్టు స్వీకరించినప్పటికీ, న్యాయస్థానంలో తాము సరైన వాదనలు వినిపించి తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary
Extraditing fugitive businessman Vijay Mallya to India from the UK, for multicrore loan recovery cases by several banks, would pave way for a speedy trial in the country, according to the Enforcement Directorate (ED), the central agency that booked Mallya for laundering an estimated Rs 9,000 crore, on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X