వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇతర రాష్ట్రాలకు పాకిన అల్లర్లు: గవర్నర్ కార్యాలయాలపై దాడికి ట్రంప్ మద్దతుదారుల ప్లాన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా రాజధానిలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఇతర రాష్ట్రాలకూ పాకాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్తతుదారులు అనేక రాష్ట్రాల్లో ఆందోళనలకు దిగారు. గవర్నర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. గవర్నర్ కార్యాలయాల్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వాషింగ్టన్‌లో అల్లర్లు చెలరేగిన వెంటనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతా బలగాలను మోహరింపజేశారు.

అర్ధరాత్రి అమెరికా పార్లమెంట్ భేటీ..ట్రంప్ తప్పుకోవడమే బాకీ: ఓట్ల లెక్కింపుపై జోరుగాఅర్ధరాత్రి అమెరికా పార్లమెంట్ భేటీ..ట్రంప్ తప్పుకోవడమే బాకీ: ఓట్ల లెక్కింపుపై జోరుగా

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్‌ను లాంఛనప్రాయంగా ఆ దేశ పార్లమెంట్ సమావేశమైన అనంతరం ఈ అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. సమావేశాలను అడ్డుకోవడం ద్వారా తమ నిరసనలను తెలియజేయడానికి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వేలాదిమంది వాషింగ్టన్‌లో ప్రదర్శనలను నిర్వహించారు. పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌ను ముట్టడించారు. సమావేశాలను భగ్నం చేశారు. ఈ ఘటనతో వాషింగ్టన్ రణరంగంగా మారింది.

Violence at US Capitol: Other smaller crowds gathered at statehouses across the country

అదే సమయంలో- మిగిలిన రాష్ట్రాల్లోనూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు రోడ్లెక్కారు. ఏకకాలంలో ఆందోళనలకు దిగారు. కన్సాస్, ఓహియో, మిన్నెసొటా, కాలిఫోర్నియా, జార్జియా, ఇండియానా, న్యూమెక్సికోల్లో ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. గవర్నర్ కార్యాలయాల ముందు బైఠాయించారు. వుయ్ స్టాండ్ విత్ ట్రంప్..వుయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మైక్‌ల ద్వారా నినదాలను వినిపిస్తూ కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఫోటోలు: వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసనలు

ఈ పరిస్థితుల మధ్య వాషింగ్టన్‌లో అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశం అయ్యాయి. ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే కీలక రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలపై మూజువాణి ఓటు రూపంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రంతా కొనసాగేాలా కనిపిస్తోంది. అనంతరం ఎలక్టోరల్ కాలేజ్ అందించిన ఓట్ల లెక్కింపు వివరాలకు అధికారికంగా ఆమోదం తెలియజేస్తుంది.

English summary
While a pro-Trump mob forced entry into the US Capitol building in Washington, DC, other smaller crowds gathered at statehouses across the country, including those in Kansas, Ohio, Minnesota and California. In Atlanta, senior staffers at Georgia Capitol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X