వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:కుప్పకూలిన మెట్రో రైల్ -బ్రిడ్జి విరిగి రోడ్డుపై పడ్డ బోగీలు -20మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

అప్పటికే పొద్దు పోవడంతో డ్యూటీలు, వ్యాపారాలు ముగించుకుని మెట్రో రైలులో ఇళ్లకు వెళుతోన్నవారంతా కునికిపాట్లు పడుతున్నారు.. సబ్ వే ను చీల్చుకుంటూ మెట్రో రైలు ఎలివేటెడ్ కారిడార్ లోకి ప్రవేశించింది.. మెట్రో దాటుతుండగా వంతెన ఒక్కసారిగా విరిగిపడింది.. అంతే, భారీ శబ్దంతో రైలు బోగీలు అమాంతం రోడ్డుపైన కుప్పకూలిపోయాయి.. లోపలున్న ప్రయాణికులతోపాటు కింద రోడ్డుపై వెళుతోన్న వాహనాలూ నుజ్జయిపోయాయి.. మెక్సికోలో జరిగిన ఈ భయానక సంఘటన వివరాల్లోకి వెళితే..

షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందాషాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా

కుప్పకూలిన మెట్రో రైలు

కుప్పకూలిన మెట్రో రైలు

ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యధిక జనాభా గల నగరం, మెక్సికో దేశ రాజధాని అయిన మెక్సికో సిటీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలివేటెడ్ బ్రిడ్జి కూలడంతో మెట్రో బోగీలు అమాంతం రోడ్డుపై కుప్పకూలాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30కు చోటుచేసుకున్నఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంబించాయి. మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షైన్బమ్ దగ్గరుండి రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్కేసీఆర్‌..చావునైనా భరిస్తా, నిన్ను క్షమించ -వైఎస్సార్‌కే భయపడలే, రాజీనామా చేస్తా -గుట్టు విప్పిన ఈటల రాజేందర్

గోల్డెన్ లైన్‌లో ఘోరం

గోల్డెన్ లైన్‌లో ఘోరం

దాదాపు కోటి మంది నివసించే మెక్సికో సిటీలో మెట్రో రైళ్లు నిత్యం రద్దీగా తిరుగుతుంటాయి. మెట్రో విస్తరణలో భాగంగా నిర్మించిన 12వ మార్గాన్ని గోల్డెన్ లైన్ గా పిలుస్తారు. సోమవారం వంతెన కూలి మెట్రో ప్రమాదానికి గురైంది కూడా ఈ గోల్డెన్ లైన్ లోనే. అగ్నిమాపక సిబ్బంది, ఇరత రెస్క్యూ విభాగాలు.. మెట్రో వంతెన శిధిలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడుతూ మృతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రులకు తరలించారు. మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదం తాలూకు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. కాగా,

నాణ్యత లోపం వల్లే మెట్రో ప్రమాదం

నాణ్యత లోపం వల్లే మెట్రో ప్రమాదం

మెక్సికో సిటీ మెట్రో రైలుకు సంబంధించి గోల్డెన్ లైన్ మార్గం నిర్మాణంలో అక్రమాలు జరిగినట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయ. ప్రస్తుతం మెక్సికో విదేశాంగ మంత్రిగా మార్సెలో ఎబ్రాడ్ గతంలో మెక్సికో సిటీ నగర మేయర్‌గా ఉన్నప్పుడు ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఉత్తర అమెరికాలో రెండో అతిపెద్ద మెట్రోగా మెక్సికో సిటీ మెట్రోకు పేరుంది. సిటీలో మెట్రో ప్రారంభించి 50 ఏళ్లు కావొస్తుండగా, ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో సోమవారం ఘటనే అతిపెద్దది. ఇప్పటికే 20 మంది చనిపోగా, మృతుల సంఖ్య మంరింత పెరిగే అవకాశముంది..

Recommended Video

paceX Capsule With 2 NASA Astronauts Safely Return to Earth | Oneindia Telugu

English summary
An overpass in Mexico City''s metro collapsed Monday night, sending a train plunging toward a road, trapping at least one car under rubble and killing at least 20 people, authorities said. Mayor Claudia Sheinbaum said 70 people were injured, with 34 hospitalised, and people could still trapped inside the train, which was split in two and appeared partially suspended. Video showed a car trapped under rubble, with dozens of rescuers searching through wreckage of the collapse structure. The overpass was about 5 meters above the road in southern Mexico City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X