మిస్టర్ ట్రంప్.. భారత్ జోలికొస్తే సహించం
అమెరికా సహా యూరోప్ దేశాలు భారత్, చైనాపై విధించ తలపెట్టిన సెకెండరీ శాంక్షన్స్ పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. ఇవి వలసవాద ఆలోచనాధోరణిని ప్రతిబింబిస్తోన్నాయని, ప్రపంచ దేశాలపై దుష్ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఉక్రెయిన్ ను సాకుగా చూపిస్తూ రష్యా, భారత్, చైనా వంటి దేశాలపై ఆంక్షలు విధించాలనుకోవడం మూర్ఖత్వమౌతుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ట్రంప్.. చైనాలో పర్యటిస్తోన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనడానికి చైనా వచ్చారాయన. అనంతరం బీజింగ్ లో చైనా విక్టరీ డే పరేడ్ కూ హాజరయ్యారు. నాలుగు రోజుల పర్యటన ముగియనుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్ పై సెకెండరీ శాంక్షన్స్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల స్పందించారు. దీన్ని తిప్పి కొట్టారు.

భారత్ లాంటి దేశంలో దాదాపు 1.5 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, రష్యా వంటి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ కొనసాగుతున్నాయని అన్నారు. ఆయా దేశాలన్నీ కూడా సార్వభౌమాధికారం, సొంత దేశీయ రాజకీయ విధానాలు, చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి దేశాలను శిక్షిస్తామనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. వలసవాద అనుభవాలు, సార్వభౌమత్వంపై దాడులు ఎదుర్కొన్న దేశాలు ఇబ్బందులకు గురవుతాయని చెప్పారు.
వలసవాద యుగం ఎప్పుడో ముగిసిపోయిందని, మిత్ర/భాగస్వామ దేశాలతో మాట్లాడేటప్పుడు ఆ పదాన్ని ఎటవంటి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదనే విషయాన్ని అమెరికా, ఇతర యూరప్ దేశాలు గ్రహించాలని పుతిన్ సూచించారు. రష్యాతో బలమైన ఆర్థిక సంబంధాలున్న దేశాలపై చర్యలు తీసుకోవడానికి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఓ సాకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పరిస్థితికి, ఇటీవలి వాణిజ్య చర్యలకు సంబంధం లేదని పుతిన్ కొట్టిపారేశారు. దీన్ని వాణిజ్య ఆంక్షలు, టారిఫ్ విధింపులను సమర్థించడానికి ఉద్దేశపూరకంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభంతో ఏ మాత్రం సంబంధం లేని బ్రెజిల్ పై ఆంక్షలు, అదనపు టారిఫ్ ను విధించడాన్ని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు పుతిన్. అమెరికా, భారత్, చైనా మధ్య వాణిజ్య అసమతౌల్యం ఉందని, బ్రెజిల్ తో ఆ సమస్య లేనప్పటికీ.. అధిక టారిఫ్ ఎందుకు విధించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications