ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందం అసాధ్యం: పుతిన్ సంచలనం
ఉక్రెయిన్- రష్యా మధ్య గత మూడేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ లు, క్షిపణులతో దాడులను కొనసాగిస్తోంది. ఇటీవల 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో కీవ్ నగరంపై విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలిపాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించేందుకు చేస్తున్న శాంతి ఒప్పందం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ఈవెంట్ కు హాజరైన పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ ముందుకొస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తనతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కానీ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రాక్టికల్ గా సాధ్యం కావని పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
🚨BREAKING: Putin says it is “practically impossible” for Russia and Ukraine to reach a deal on key issues. pic.twitter.com/ae6ZtTGpgT
— The Daily CPEC (@TheDailyCPEC) September 5, 2025
మరోవైపు ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలను సఫలీకృతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్నారు. ఈ మేరకు రష్యాపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. రష్యాపై అధిక మొత్తంలో టారిఫ్ లు అమెరికా విధిస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అయితే పుతిన్ మాత్రం ట్రంప్ మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు సాధ్యం కావని పుతిన్ చెబుతున్నారు. కీలకమైన సమస్యలపై ఉక్రెయిన్ తో ఏకీభవించలేమని.. టెక్నికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఆర్మీ చట్టం అమల్లో ఉంది.. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు సరిహద్దు దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు వీలు లేదని తెలిపారు. ఒకవేళ మార్షియల్ లా ను ఎత్తివేస్తే వెంటనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని పుతిన్ స్పష్టం చేశారు.
అయితే రష్యాతో శాంతి ఒప్పందం చేసుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. రష్యా యుద్ధం తీరును ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీకి జెలెన్ స్కీ వివరించారు. ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రధాని మోదీ.. జెలెన్ స్కీకు హామీ ఇచ్చారు. అనంతరం చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన SCO సమావేశంలో రష్యా, భారత్ పాల్గొన్నాయి. ఈ సమావేశంలో పుతిన్ కారులోనే మోదీతో దాదాపు 45 నిమిషాల పాటు సంభాషించారు. ఈ భేటీలో అమెరికా టారిఫ్ లు, ఉక్రెయిన్ యుద్ధం, తదితర సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications