వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ విషాదం: ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసిన వాలంటీర్ మృతి

|
Google Oneindia TeluguNews

సావోపాలో/ఫ్రన్ఫర్ట్: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాక్తంగా అనేక వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని ప్రయోగ దశలు విజయవంతమైనప్పటికీ.. చివరి దశలో ఆ వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో మరోసారి మొదట్నుంచి ప్రయోగాలను ప్రారంభిస్తున్నారు శాస్త్రవేత్తలు.

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులుతెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 20వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

తాజాగా, ఓ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల్లో విషాదం చోట చేసుకుంది. ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్‌ను వేయించుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బ్రెజిల్ ఆరోగ్య విభాగం బుధవారం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

 Volunteer in Oxford Covid vaccine test dies in Brazil: Officials report

కాగా, పలు దేశాల్లో దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదటి, రెండో దశ పరీక్షల సందర్భంగా ఇటీవల బ్రిటన్‌లో కూడా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు బ్రెజిల్, బ్రిటన్‌లలో పరీక్షలను పునర్ ప్రారంభించారు.

మూడోదశ క్లినికల్ పరీక్షల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను వేయించుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడని, ఇందుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తమకు అందిందని బ్రెజిల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సదరు వ్యక్తి టీకా కారణంగానే మరణించారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తదుపరి పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

మరోవైపు, వాలంటీర్ మృతి వివరాలను సమీక్షించామని, తమ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి బక్స్‌టన్ తెలిపారు. వ్యాక్సిన్‌తో వాలంటీర్ మృతి చెందాడనే వార్తలతో ఆస్ట్రాజెనికా 18 శాతం క్షీణించాయి.

English summary
Brazilian health authority Anvisa said on Wednesday that a volunteer in a clinical trial of the Covid-19 vaccine developed by AstraZeneca and Oxford University had died but added that the trial would continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X