ముంబై మారణహోమం మాస్టర్ మైండ్ మృతి
Hafiz Abdul Rehman Makki: పాకిస్తాన్‌కు చెందిన కరడగుట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కి.. మరణించాడు. గుండెపోటుతో అతను మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన సమా టీవీ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది.
యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కి. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు స్వయానా బావమరిది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని శరీరంలో షుగర్ లెవెల్స్ క్షీణించాయి.

దీనితో లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్నాడు. అదే సమయంలో తీవ్ర గుండెపోటుకు గురి అయ్యాడని సమా పేర్కొంది. 26/11 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తారు. 2023లో ఐక్యరాజ్యసమితి భద్రత మండలి అతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హఫీజ్ సయీద్‌తో కలిసి ఈ మారణహోమానికి పథకం పన్నాడు. దాన్ని పక్కాగా అమలు చేయగలిగాడు.
నాటి ముంబై దాడుల్లో 166 మంది మరణించిన విషయం తెలిసిందే. 2000 డిసెంబర్ 22వ తేదీన దేశ రాజధానిలోని రెడ్ ఫోర్ట్‌పై ఉగ్రవాదుల దాడికీ అతనే సూత్రధారి. 2018లో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పంజా విసిరాడు. రైజింగ్ కాశ్మీర్ దినపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ షుజత్ బుఖారీ, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను హత్య చేయడంతో అతని పేరు మార్మోగిపోయింది. దీని తరువాత అతన్ని వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. అతనిపై రివార్డ్ సైతం ప్రకటించింది.
వివిధ నేరాల కింద 2019లో అతన్ని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలం గృహ నిర్బంధంలో ఉంచారు. ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న కారణంగా 2020లో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది పాకిస్తాన్ న్యాయస్థానం. 2023లో మక్కీపై గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ముద్ర పడింది.












Click it and Unblock the Notifications