Viral video:చిన్నారి సృజన సూపర్, కర్రలతో జేసీబీ, వావ్ అంటోన్న నెటిజన్లు
సృజనకు కొదువ లేదు. అయితే ఏ ఒకరికో సొత్తు కాదు. ఆలోచనలను ఆవిష్కరిస్తే చాలు. అందుకే చిన్న, పెద్ద తేడా లేదు. బీద, ధనిక అనే బేధం లేనే లేదు. ఎక్కడో తెలియదు కానీ.. ఓ బుడ్డొడు.. ఏకంగా బల్డొజర్ (జేసీబీ)ని.. కర్రలతోనే తయారు చేశాడు. దానితో మట్టిని కూడా తీస్తున్నాడు. ఆ వీడియో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

కర్రలతో జేసీబీ..
అతను కర్రలతోనే జేసీబీలా తయారు చేశాడు. ఓ 10 కర్రలను తీసుకొని.. జేసీబీ తయారీకి అనుగుణంగా కట్ చేశాడు. దానికి మట్టి తీసేందుకు ఓ చిన్న వస్తువును తయారు చేశాడు. ఇంకేముంది.. వాటన్నింటినీ మూడి వేశాడు. కూర్చొనేందుకు కూడా ప్లేస్ ఉంచి.. దానిపై తట్టు లాంటి బొంత వేశాడు. తన రెండు చేతుల్లో కర్రలతోనే ఉంచి.. ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. అవీ కదిలాయి. అలా అక్కడి నుంచి మట్టి తీయడం స్టార్ట్ చేశారు.
సృజన సూపర్
ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. పిల్లాడి క్రియేటివిటీని మాత్రం అంతా మెచ్చుకుంటున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సృజనాత్మకతను మెచ్చుకోవాల్సిందే అని ఒకరు రాశారు. అతని చాతుర్యం చూడండి.. అతనిని ప్రశంసించండి అని రాశారు. మరొకరు చాలా చక్కగా చేశాడో అని సంబరపడ్డారు. అతని సృజనను అభినందిస్తున్నానని ఒకరు కామెంట్ రాశారు. మరొకరు కంగ్రాట్స్ చెబుతూ రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా తమ రియాక్షన్స్ ఇచ్చారు.

వెన్నుతట్టాల్సిందే..?
నిజమే ఆ పిల్లాడు చేసింది చిన్న ప్రయత్నమే.. కానీ అతనిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అతను మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు ఆ ప్రోత్సాహం సాయపడుతుంది. చిన్న వయస్సలోనే.. అతని నుంచి ఇంజినీరింగ్ ప్రతిభను వెలికితీయొచ్చు.. అతనిని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారు. ఇలా కొత్తవారిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications